నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్‌కు గాయం

నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్.. ఇషాన్ కిషన్ గాయపాటు..

టీ20 ప్రపంచకప్‌ 2026లో నమీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు మరో గాయాల షాక్ తగిలింది. వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ నెట్ ప్రాక్టీస్ సమయంలో జస్ప్రీత్ బుమ్రా వేసిన వేగవంతమైన యార్కర్‌ను ఎదుర్కొంటూ గాయపడ్డాడు. బంతి నేరుగా అతని ఎడమ కాలి బొటనవేలికి తాకడంతో నొప్పితో కిషన్ మైదానంలోనే కూర్చున్నాడు.

వెంటనే ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించగా కాస్త కోలుకున్నాడు. నెట్ సెషన్‌ను వదిలి వెళ్లిపోయిన కిషన్, కొంతసేపటి తర్వాత తిరిగి మైదానంలో కనిపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానుల్లో ఆందోళన రేపుతోంది.

ఇషాన్ గాయం తీవ్రతపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడకపోయినా, జట్టు యాజమాన్యం అతని ఫిట్‌నెస్‌పై జాగ్రత్తగా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఇప్పటికే గాయాలు టీమిండియాను వెంటాడుతున్నాయి. అభిషేక్ శర్మ కడుపు సమస్యతో నమీబియా మ్యాచ్‌కు దూరమవుతుండగా, హర్షిత్ రాణా ప్రపంచకప్ మొత్తానికి అవుట్ అయ్యాడు.

వాషింగ్టన్ సుందర్, బుమ్రా, తిలక్ వర్మలూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో ఇషాన్ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్థిస్తున్నారు. కీలక మ్యాచ్‌ల ముందు వరుస గాయాలు జట్టుకు ఆందోళన కలిగిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment