‘ఇరుముడి’ సినిమా రివ్యూ

'ఇరుముడి' సినిమా రివ్యూ

Summarize with AI

టైటిల్: ఇరుముడి (Irumudi)
నటీనటులు: రవితేజ, ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్‌ ఇందిర తదితరులు
దర్శకత్వం: శివ నిర్వాణ
సంగీతం: జీవీ ప్రకాశ్‌ కుమార్‌
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్‌

వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరిస్తున్న మాస్‌ మహారాజా రవితేజ నుంచి వస్తున్న మోస్ట్ హైప్డ్ సినిమా ‘ఇరుముడి’(Irumudi). దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) తెరకెక్కించిన ఈ చిత్రంపై అనౌన్స్‌మెంట్‌ నుంచి మంచి అంచనాలున్నాయి. రవితేజ (Ravi Teja) రెగ్యులర్ మాస్ ఇమేజ్‌కు భిన్నంగా అయ్యప్ప మాల నేపథ్యం, బలమైన భావోద్వేగాలతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఎలా వచ్చింది? రవితేజకు ఈ చిత్రం సరైన హిట్‌ అందించిందా? చూద్దాం.

కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitharama Raju District), సీలేరు (Sileru) ప్రాంతంలోని ఒక అందమైన గ్రామానికి చెందిన త్రినాథ్‌ (రవితేజ) అరటిపళ్ల వ్యాపారం చేస్తుంటాడు. భార్య కావేరి (ప్రియా భవానీ శంకర్), కూతురు మణికంఠ అలియాస్‌ మణెమ్మ (బేబీ నక్షత్ర) అంటే అతనికి ప్రాణం. ప్రతి ఏడాది అయ్యప్ప మాల (Ayyappa Mala) ధరించే 41 రోజులు మినహా.. మిగతా రోజుల్లో తాగుతూ తిరిగే సాధారణ వ్యక్తి త్రినాథ్.

అయితే, ఊర్లో ఐదో తరగతి వరకు మాత్రమే స్కూల్ ఉండటంతో హైస్కూల్ విద్య కోసం కూతురిని సీలేరుకు పంపిస్తాడు. అదే సమయంలో ఆ స్కూల్‌లో చదువుకునే అమ్మాయిలు ఒక్కొక్కరిగా అనుమానాస్పద రీతిలో చనిపోతుంటారు. ఆ ప్రమాదకర నిజాలు చిన్నారి మణికంఠకు తెలుస్తాయి. ఆ నిజాలు ఏంటి? ఆ భయానక పరిస్థితుల నుంచి త్రినాథ్‌ తన కూతురిని, ఊరిలోని ఆడపిల్లలను ఎలా కాపాడాడు? గురుస్వామి గోపరాజు (సాయికుమార్)తో ఆయనకున్న అనుబంధం ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ..
రవితేజను అయ్యప్ప మాల (Ayyappa Mala) నేపథ్యంలో చూపిస్తామని ప్రకటించినప్పటి నుంచే ఈ చిత్రంపై ఆసక్తి నెలకొంది. భక్తి నేపథ్యాన్ని తీసుకున్నప్పటికీ.. దర్శకుడు శివ నిర్వాణ దీన్ని పక్కా కమర్షియల్, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా మలిచారు.

ఫస్టాఫ్‌..
సినిమా మొదటి భాగం సరదాగా, తండ్రీకూతుళ్ల అనుబంధం, భక్తి పాటలు, గ్రామ వాతావరణంతో సాగిపోతుంది. అయితే స్కూల్ ఎపిసోడ్స్‌లో కొన్ని సన్నివేశాలు రిపీటెడ్‌గా అనిపించడం వల్ల కథ అక్కడక్కడే తిరుగుతున్న భావన కలుగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచుతుంది.

సెకండాఫ్‌..
అసలు కథ సెకండాఫ్‌లోనే ప్రారంభమవుతుంది. ఆడపిల్లలను ఎలా పెంచాలి, వారిలో భయం పోగొట్టి ధైర్యంగా ఎలా నిలబెట్టాలనే సున్నితమైన, కఠినమైన సామాజిక అంశాన్ని దర్శకుడు బలంగా చూపించారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను తీవ్ర భావోద్వేగానికి గురిచేస్తాయి. కొన్నిచోట్ల సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నప్పటికీ, బలమైన కంటెంట్ ఆ లోపాలను కవర్ చేస్తుంది.

  • నటీనటుల ప‌ర్ఫామెన్స్‌
  • రవితేజ తన రెగ్యులర్ మాస్ పాత్రలకు భిన్నంగా ఒక బాధ్యత గల మధ్యతరగతి తండ్రి త్రినాథ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. ఎమోషనల్ సీన్స్‌లో ఆయన పరిణతి చెందిన నటన మెప్పిస్తుంది.
  • ఈ సినిమాకు అసలైన ప్రాణం బేబీ నక్షత్ర. ఆమె నటన సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. కీలక సన్నివేశాల్లో ఆమె అద్భుతంగా నటించింది.
  • ప్రియా భవానీ శంకర్ గృహిణి పాత్రలో చాలా సహజంగా కనిపించింది.
  • సాయికుమార్ (గురుస్వామి పాత్రలో), అజయ్ ఘోష్ తదితరులు తమ పరిధి మేరకు చక్కగా నటించి కథను ముందుకు నడిపించారు.
  • సాంకేతిక వర్గం..
  • జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం. ముఖ్యంగా అయ్యప్ప భక్తి పాటలు, నేపధ్య సంగీతం (BGM) సినిమా స్థాయిని పెంచాయి.
  • సీలేరు ప్రాంతపు ప్రకృతి అందాలను సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది.
  • ఎడిటింగ్ విషయంలో సెకండాఫ్‌లో అక్కడక్కడ కొన్ని సాగదీత సన్నివేశాలపై మరింత దృష్టి పెడితే బాగుండేది.
  • నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.

‘ఇరుముడి’ కేవలం రొటీన్ కమర్షియల్ చిత్రం మాత్రమే కాదు; ఆడపిల్లల భద్రత, పెంపకంపై ఆలోచింపజేసే ఒక మంచి సందేశాత్మక సినిమా. రవితేజ నటన, బలమైన భావోద్వేగాలు, జీవీ ప్రకాష్ సంగీతం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్లు. స్లోగా సాగే కొన్ని సన్నివేశాలను పక్కన పెడితే.. ఈ వారాంతంలో కుటుంబ సమేతంగా చూడదగ్గ మంచి ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ ఇది.

రేటింగ్: 2.75/5

Join WhatsApp

Join Now

Leave a Comment