చాహల్ హ్యాట్రిక్‌.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు

చాహల్ హ్యాట్రిక్‌.. ఒకే ఓవర్‌లో 4 వికెట్లు

Summarize with AI

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025 సీజ‌న్‌లో పంజాబ్ (Punjab) స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అదరగొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చాహల్ హ్యాట్రిక్‌తో విజృంభించాడు. తాను వేసిన 19వ ఓవర్లో తొలి బంతికి ధోనీ సిక్స్ కొట్టగా, రెండో బంతికే కెప్టెన్ కూల్‌ని చాహ‌ల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో వరుసగా చివరి మూడు బంతుల్లో కంబోజ్, హుడా, నూర్ అహ్మద్లను ఔట్ చేసి హ్యాట్రిక్ నమోదు చేశాడు.

ఒక్క ఓవర్‌లో నలుగురు కీలక ఆటగాళ్లను పెవిలియన్‌కి పంపిన చాహల్ మ్యాచ్‌ను పంజాబ్ దిశగా మళ్లించాడు. ఈ విధంగా చెన్నై జట్టు 190 పరుగులకు ఆలౌట్ అయింది. చాహల్ బౌలింగ్‌తో పంజాబ్ అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఒకే ఓవ‌ర్‌లో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి జ‌ట్టు విజ‌యంలో చాహ‌ల్ కీల‌క పాత్ర పోషించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment