భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

భారత్-ఆసిస్‌ నాలుగో టెస్ట్‌.. న‌ల్ల బ్యాడ్జీల‌తో బ‌రిలోకి టీమిండియా

మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్టులో భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉత్కంఠభరిత పోరాటం కొనసాగిస్తున్నాయి. ఈ మ్యాచ్ సిరీస్‌లోని నిర్ణయాత్మకమైనదిగా మారింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో స్థానం కోసం ఇరుజట్లు తమ పోరాటం సాగిస్తున్నాయి. ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా, సామ్ కాన్స్టాస్ దంచికొట్టిన ఇన్నింగ్స్, స్టీవ్ స్మిత్ క్లాసిక్ బ్యాటింగ్‌కి భారత బౌలర్లపై ఆధిపత్యం చూపించారు. అయితే, జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన స్పెల్‌తో భారత్ తిరిగి గేమ్‌లోకి వచ్చింది.

స్టీవ్ స్మిత్ సెంచరీ..
మ్యాచ్ తొలి రోజు ఆస్ట్రేలియా 6 వికెట్లు కోల్పోయి 308 పరుగులతో నిలిచింది. రెండో రోజు ఉదయం పాట్ కమిన్స్ 49 పరుగుల వద్ద పెవిలియన్ చేరగా, స్టీవ్ స్మిత్ తన సెంచరీని పూర్తి చేసి, ఆసీస్ జట్టును 7 వికెట్లకు 453 పరుగుల వద్ద నిలబెట్టాడు.

నల్ల ఆర్మ్ బ్యాండ్‌తో భారత జట్టు..
రెండో రోజు ఆట ప్రారంభమైంది. భారత జట్టు నల్ల ఆర్మ్ బ్యాండ్‌లతో బరిలోకి దిగింది. భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతికి నివాళులర్పిస్తూ టీమిండియా ఇలా న‌ల్ల బ్యాడ్జీల‌తో మైదానంలోకి దిగింది. డాక్టర్ మన్మోహన్ సింగ్ 92 సంవత్సరాల వయస్సులో ఢిల్లీలో ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004-2014 మధ్య పది సంవత్సరాల పాటు భారత ప్రధానిగా దేశానికి అమూల్య సేవలందించిన ఆయన మృతి పట్ల భారత జట్టు కృతజ్ఞతగా ఈ చర్య చేపట్టింది.

Join WhatsApp

Join Now

Leave a Comment