2026 ఆసియా గేమ్స్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అదరగొట్టింది. జపాన్‌తో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. తొలుత భారత బౌలర్ల ధాటికి జపాన్ 19.5 ఓవర్లలో 57 పరుగులకే ఆలౌట్ కాగా.. భారత్ కేవలం 5 ఓవర్లలోనే 59/2 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించింది.
58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టులో షఫాలీ వర్మ విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. ఆమె 15 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 40 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది. రిచా ఘోష్ 12 పరుగులతో అజేయంగా నిలవడంతో భారత్ 30 బంతుల్లోనే విజయాన్ని అందుకుంది.
ఈ గెలుపుతో భారత మహిళల జట్టు టీ20ల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. 90 బంతులు మిగిలుండగానే సాధించిన ఈ విజయం.. టీ20ల్లో భారత్ అత్యధిక బంతులు మిగిలుండగా గెలిచిన విజయంగా నమోదైంది. అంతకుముందు 2022లో థాయ్‌లాండ్‌పై 84 బంతులు మిగిలుండగా సాధించిన విజయం భారత్ పేరిట ఉండగా.. ఇప్పుడు జపాన్‌పై ఆ రికార్డు బద్దలైంది.








