తెలుగు చిత్రపరిశ్రమలో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న నేచురల్ స్టార్ నాని(Natural Star Nani), తన మార్కెట్ రేంజ్ మరియు థియేట్రికల్ బిజినెస్‌ను(Theatrical Business) అనూహ్యంగా పెంచుకున్నారు. శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో వచ్చి బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘దసరా‘ సినిమా నుంచి అదే కాంబినేషన్లో వస్తున్న భారీ యాక్షన్ చిత్రం ‘ది ప్యారడైజ్‘(The Paradise) వరకు నాని తెలుగు థియేట్రికల్ హక్కుల మార్కెట్ (Telugu Theatrical Rights Market)దాదాపు మూడు రెట్లు పెరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
2023లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ‘దసరా’ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వ్యాపారం సుమారు రూ. 30 కోట్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు దాదాపు మూడేళ్ళ తర్వాత శ్రీకాంత్ ఓదెల-నాని కాంబో(Srikanth Odela-Nani Combo) రిపీట్ అవుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి తెలుగు థియేట్రికల్ మరియు ఓవరాల్ థియేట్రికల్ మార్కెట్ వాల్యూ కలిపి ఏకంగా రూ. 100 కోట్లకు పైగా ప్రీ-రిలీజ్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. వరస విజయాలతో పాటు కథల ఎంపికలో చూపిస్తున్న వైవిధ్యం నాని మార్కెట్‌ను టైర్ 2 రేంజ్ నుండి టైర్ 1కు సమానమైన స్థాయికి తీసుకెళ్లింది.
‘దసరా’ తెచ్చిపెట్టిన గ్లోబల్ క్రేజ్, శ్రీకాంత్ ఓదెల అందించే మాస్ ఎమోషనల్ మేకింగ్ మైత్రీ మూవీ మేకర్స్ వంటి ప్రముఖ పంపిణీదారులు భారీ ధరకు నైజాం హక్కులను(Nizam Rights) దక్కించుకోవడం ఈ భారీ వ్యాపారానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. అయితే ప్యారడైజ్ రికవరీ ఏ రేంజ్ వరకు ఉంటుందనేది ఇప్పుడు ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఓపెనింగ్ డే మంచి అవకాశం ఉందని టాక్ ని బట్టి రన్నింగ్ ఉంటుందని భారీ ధరకు కొనుగోలు చేయడం కాస్త రిస్క్ అని డిస్ట్రిబ్యూటర్స్ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుస.








అధికారంలోకి రాగానే ఆ భూములు వెనక్కి తీసుకుంటాం