మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ.. ఫైనల్లోకి భారత్

మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీ.. ఫైనల్లోకి భారత్

Summarize with AI

చైనాలో(China) జరుగుతున్న మహిళల(Women’s) జూనియర్ ఆసియా కప్ హాకీలో(Junior Asia Cup Hockey) భారత్(India) ఫైనల్‌కు(Final) దూసుకెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్‌లో దక్షిణ కొరియాపై(South Korea) భారత్(India) 5-1 గోల్స్ తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున సుప్రియా(Supriya) హ్యాట్రిక్‌తో అదరగొట్టగా, మధు సిదార్(Madhu Sidar), సుఖ్‌వీర్ కౌర్ (Sukhveer Kaur) చెరో గోల్ చేశారు. దక్షిణ కొరియా తరఫున యూరి జియోంగ్ ఏకైక గోల్ సాధించింది. దీంతో భారత్ వరుసగా మూడోసారి టోర్నీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

టోర్నీలో భారత్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. క్వార్టర్‌ఫైనల్‌లో పాకిస్థాన్‌ను(Pakistan) 19-0 గోల్స్‌తో చిత్తు చేసిన భారత జట్టు.. సెమీఫైనల్‌లోనూ అదే దూకుడును ప్రదర్శించింది. ఫైనల్‌లో భారత్(India).. చైనా(China),, జపాన్ (Japan) మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో తలపడనుంది. 2023, 2024 ఎడిషన్లలో వరుసగా టైటిళ్లు సాధించిన భారత్.. ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ టైటిళ్లను సొంతం చేసుకోవాలని పట్టుదలగా ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment