ప్రాణాలతో తిరిగొస్తానో లేదో తెలియదు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

ప్రాణాలతో తిరిగొస్తానో లేదో తెలియదు.. ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు!

Summarize with AI

పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (PTI) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన తన ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు (Pakistan Supreme Court) ప్రధాన న్యాయమూర్తులకు బహిరంగ లేఖ (Open Letter) రాశారు. అడియాల జైలులో(Adiala Jail) తనకు, తన భార్య బుష్రా బీబీకి (Bushra Bibi) తక్షణ వైద్య సహాయం అందించాలని కోరారు. జైలులో సుదీర్ఘకాలం ఏకంగా నిర్బంధంలో ఉన్నందున తన ఆరోగ్యం క్షీణించిందని, ప్రస్తుత పరిస్థితుల్లో తాను ప్రాణాలతో తిరిగి రాకపోవచ్చని లేఖలో పేర్కొన్నారు. నవంబర్ 11న ఆదియాలా జైలులో ఇమ్రాన్‌ను కలిసిన ఆయన లాయర్ సల్మాన్ సఫ్దర్ (Salman Safdar) ఈ లేఖ అందించి, న్యాయమూర్తులకు ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.

నవంబర్ 16న పాకిస్థాన్ ఫెడరల్ కాన్‌స్టిట్యూషనల్ కోర్టు (FCC), సుప్రీంకోర్టు, ఇస్లామాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు ఈ లేఖ రాసినట్లు తెలుస్తోంది. తన కంటి చూపు మందగించడం, తనకు వైద్య చికిత్స అందించాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు అమలు కాకపోవడం ఈ లేఖ రాయడానికి కారణమని ఇమ్రాన్ పేర్కొన్నారు.

ఏకాంత నిర్బంధం కారణంగా తన ఆరోగ్యం తీవ్రంగా క్షీణించిందని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆవేదన వ్యక్తం చేశారు. మొదట 130గా ఉన్న తన రక్తపోటు (Blood Pressure – BP) ప్రస్తుతం 192కు చేరిందని, నవంబర్ 10న 193గా నమోదైందని లేఖలో పేర్కొన్నారు. దీనివల్ల మెదడులో రక్తస్రావం, గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం ఉందని, తన గుండె కూడా ఇప్పటికే దెబ్బతిన్నట్లు వైద్యులు తెలిపారని వెల్లడించారు.

రోజుకు 22 గంటల పాటు ఏకాంత నిర్బంధంలో ఉంచుతున్నారని, కుటుంబ సభ్యులు, న్యాయవాదులు, విదేశాల్లో ఉన్న కుమారులను కలిసేందుకు అనుమతించడం లేదని ఆరోపించారు. పుస్తకాలు చదవడం, టీవీ చూడటానికి కూడా అవకాశం లేదని, కుడి కంటి చూపు 85 శాతం వరకు తగ్గిపోయిందని తెలిపారు. తనను షిఫా ఇంటర్నేషనల్ ఆసుపత్రికి (Shifa International Hospital) తరలించి వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించినప్పటికీ అమలు చేయలేదని, 74 ఏళ్ల వయసులో ప్రాణాలతో తిరిగి వస్తానో లేదోనన్న ఆందోళనలో ఉన్నానని ఇమ్రాన్ ఖాన్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment