పార్టీ మారే ఊసరవెల్లి రేవంత్‌: హరీష్‌రావు

పార్టీ మారే ఊసరవెల్లి రేవంత్‌: హరీష్‌రావు

Summarize with AI

తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ (BRS) సీనియర్‌ నేత హరీష్‌రావు (Harish Rao) తీవ్రంగా స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మాట్లాడుతూ, పార్టీ తనకు కన్నతల్లిలాంటిదని, నాయకుడి ఆదేశాల మేరకు పదవులను గడ్డిపోచలా వదిలేశానని అన్నారు. పార్టీ మారే ఊసరవెల్లిలా (Chameleon) వ్యవహరించే వ్యక్తి రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. సొంత పార్టీ నేతలనే తొక్కుకుంటూ రాజకీయంగా ఎదిగిన చరిత్ర ఆయనదని, ‘ఫోర్ట్‌ సిటీ ఎందుకన్న కేసీఆర్‌(KCR) ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం లేదని, రేవంత్‌ మాట్లాడేవన్నీ సొల్లు మాటలేనని’ హరీష్‌రావు మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, ఆదివారం మీడియా చిట్‌చాట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబంలోనే విభేదాలు ఉన్నాయని ఆరోపించారు. కుర్చీ కోసం కుమారుడు కేటీఆర్‌, ఆస్తుల కోసం అల్లుడు పోటీ పడుతున్నారని, పార్టీ అల్లుడి చేతిలోకి పోతుందన్న భయంతోనే కేసీఆర్‌ ఫాంహౌస్‌ నుంచి బయటకు వచ్చారని అన్నారు. కేసీఆర్‌ ఉన్నంతకాలం హరీష్‌రావు ఎక్కడికీ పోరని, పార్టీతో పాటు ఆస్తులపై కూడా ఆయన కన్నేశారని వ్యాఖ్యానించారు. అయితే బీఆర్‌ఎస్‌ను కేటీఆర్‌ చేతిలో పెట్టాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, తాను కోటి మంది మహిళలకు చీర, సారె ఇచ్చి గౌరవిస్తే, కేసీఆర్‌ కుటుంబం మాత్రం కవితను పార్టీ నుంచి బయటకు పంపిందని రేవంత్‌రెడ్డి విమర్శించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment