పహల్గామ్ (Pahalgam)లో ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో పాకిస్తాన్ (Pakistan)పై (భారత్) చర్యలు కొనసాగుతున్నాయి. మూడు రోజుల క్రితం పహల్గామ్లో జరిగిన దాడి పాక్ ప్రేరేపిత దాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో భారత్ కఠిన చర్యలకు పూనుకుంటోంది. పాక్ సింధూ జలాలు (Indus Rivers) వెళ్లకుండా అడ్డుకుంది. అంతేకాకుండా ఉగ్రవాదులను కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోడీ బిహార్ సభలో హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై పాకిస్తాన్‌కు చెందిన వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ (World’s Most Wanted Terrorist) హఫీజ్ సయ్యద్ (Hafiz Saeed) తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్ (Islamabad)లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, “పాకిస్తాన్‌కు నీళ్లు ఆపితే మోదీ శ్వాస ఆపేస్తాం (“If you stop water to Pakistan, we will stop Modi’s breath”) అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
కశ్మీర్ నదుల్లో హిందువుల రక్తం పారేలా చేస్తామని, భారతో యుద్ధం మొదలు పెడతామని, ఎవ్వరినీ వదిలిపెట్టమని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు తీవ్ర భయాందోళనలకు దారి తీయడమే కాకుండా, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు. భారత్ ఇప్పటికే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించే అవకాశం ఉంది. అంతర్జాతీయ స్థాయిలో సయ్యద్‌పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం మరోసారి స్పష్టమవుతోంది.








