ఏపీలోకి మ‌రొక‌ ‘గేమ్ ఛేంజ‌ర్‌’

ఏపీలోకి మ‌రొక‌ 'గేమ్ ఛేంజ‌ర్‌'

Summarize with AI

ఇటీవ‌ల కూట‌మి ప్ర‌భుత్వ (Coalition Government) పీ4 విధానాన్ని (P4 Policy), అమ‌రావ‌తి నిర్మాణాన్ని (Amaravati Construction) గేమ్ ఛేంజ‌ర్‌ (Game Changer)గా అభివ‌ర్ణించిన సీఎం చంద్ర‌బాబు (Chandrababu).. నేడు ఢిల్లీ (Delhi) వేదిక‌గా గూగుల్ (Google) భాగ‌స్వామి సంస్థ‌తో చేసుకున్న ఒప్పందాన్ని మ‌రొక గేమ్ ఛేంజ‌ర్‌గా అభిప్రాయ‌ప‌డ్డారు. “భారత్ ఏఐ శక్తి” (Bharat AI Shakti) కార్యక్రమం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)  మరియు గూగుల్ భాగ‌స్వామి సంస్థ రైడెన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా విశాఖపట్నం (Visakhapatnam)లో గూగుల్ డేటా సెంటర్‌ (Google Data Center)ను ఏర్పాటు చేయనుంది. ఈ ఎంవోయూ సంతకం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్, రైల్వే మరియు ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, అలాగే రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు.

వచ్చే ఐదేళ్లలో గూగుల్ రూ. 88,628 కోట్ల భారీ పెట్టుబడులు విశాఖలో పెట్టబోతోందని ప్రకటించింది. ఈ డేటా సెంటర్ నిర్మాణం ద్వారా విశాఖ ఐటీ రంగంలో ఒక ప్రధాన కేంద్రంగా మారనుంది.

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ “నా రాజకీయ జీవితంలో గూగుల్‌తో ఒప్పందం ఒక అత్యంత పెద్ద విజయంగా భావిస్తున్నాను. గతంలో నేను హైదరాబాద్‌లో హైటెక్ సిటీని అభివృద్ధి చేశాను. ఇప్పుడు అదే విధంగా విశాఖను దక్షిణ భారతదేశ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దబోతున్నాం. ఆనాడు మైక్రోసాఫ్ట్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లే, ఇప్పుడు గూగుల్‌ను విశాఖకు తీసుకొస్తున్నాం” అని తెలిపారు.

“భారతదేశం 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారడం మనందరి లక్ష్యం. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందుంది. డిజిటల్ కనెక్టివిటీ, డేటా సెంటర్లు, ఏఐ, రియల్ టైమ్ డేటా కలెక్షన్‌లు భవిష్యత్తు అభివృద్ధికి కీలకం. గూగుల్ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు మైలురాయి అవుతుంది” అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment