వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడ‌లిస్ట్ క‌న్నుమూత‌

వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ గోల్డ్ మెడ‌లిస్ట్ క‌న్నుమూత‌

జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ జాతీయస్థాయి అథ్లెట్ మృతిచెందింది. రాజస్థాన్‌కు చెందిన వెయిట్‌లిఫ్టర్ యాష్తిక ఆచార్య (17) బుధవారం బికనీర్‌లోని జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుంది. జిమ్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా స్క్వాట్ రాడ్ ఆమె చేతి నుంచి జారి మెడపై పడింది. మెడ‌పై ఒక్క‌సారిగా 270 కిలోల బ‌రువుతో రాడ్ ప‌డ‌డంతో యాష్తిక స్పృహతప్పి పడిపోయింది. యుష్తిక 270 కిలోల బరువుతో స్క్వాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న‌ట్లుగా విడుద‌లైన వీడియో తెలుస్తోంది.

సమీపంలో ఉన్న జిమ్ ట్రైనర్ త‌దిత‌రులు ఆమెకు సీపీఆర్ కూడా చేశారు. వెంటనే ఆమెను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో అథ్లెట్ మృతి చెందింది. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించామని, అథ్లెట్ మృతికి ఓవ‌ర్ వెయిట్ కారణమని నయా షహర్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ విక్రమ్ తివారీ తెలిపారు. కుటుంబ సభ్యులు కూడా ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కేసు నమోదు చేయలేదని ఆయన తెలిపారు.

యుష్తికా మరణం ఆమె స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవల గోవాలో జరిగిన 33వ జాతీయ బెంచ్ ప్రెస్ ఛాంపియన్‌షిప్‌లో యాష్తిక రెండు విభాగాల్లో బంగారు, రజత పతకాలు సాధించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment