ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘గీతాంజలి’ రీ రిలీజ్.. నాగ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్!

ఎవర్‌గ్రీన్ క్లాసిక్ ‘గీతాంజలి’ రీ రిలీజ్.. నాగ్ ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్!

Summarize with AI

అక్కినేని అభిమానులకు కింగ్ నాగార్జున (Nagarjuna) పుట్టినరోజు (Birthday) సందర్భంగా అదిరిపోయే ట్రీట్ రెడీ అయింది. తెలుగు సినీ చరిత్రలో ఎవర్‌గ్రీన్ క్లాసిక్‌గా నిలిచిన ‘గీతాంజలి’Geethanjali) మరోసారి వెండితెరపై సందడి చేయనుంది. ప్రేమ, జీవితం, భావోద్వేగాలను అద్భుతంగా మేళవించిన ఈ చిత్రాన్ని 2026 ఆగస్టు 28న రీ రిలీజ్ (Re-release) చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దాదాపు 37 ఏళ్ల క్రితం ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీని (Love Story) మరోసారి థియేటర్లలో ఆస్వాదించే అవకాశం దక్కడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ‘గీతాంజలి రీ రిలీజ్’ (Geethanjali Re-release) వార్త వైరల్‌గా మారింది.

దర్శక దిగ్గజం మణిరత్నం(Mani Ratnam) తెరకెక్కించిన ఈ చిత్రంలో నాగార్జున, గిరిజా శెట్టర్‌ల కెమిస్ట్రీ, ఇళయరాజా అందించిన మధురమైన సంగీతం ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసి ఉన్నాయి. ‘ఓ పాపా లాలి’, ‘జగడ జగడ’ వంటి పాటలు(Songs) ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూనే ఉన్నాయి. ఇటీవల క్లాసిక్ సినిమాల రీ రిలీజ్‌లకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన లభిస్తున్న నేపథ్యంలో ‘గీతాంజలి’ కూడా బాక్సాఫీస్ వద్ద మరోసారి మ్యాజిక్ చేయనుందనే అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా థియేటర్లలో ఈ సినిమాను ఎప్పుడూ చూడని యువతకు ఇది ఓ అరుదైన సినీ అనుభూతిగా మారనుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment