ఇంగ్లండ్‌తో తొలి టెస్టు..టీమిండియాకు గుడ్ న్యూస్..

ఇంగ్లండ్‌తో తొలి టెస్టు..టీమిండియాకు గుడ్ న్యూస్..

Summarize with AI

లీడ్స్ వేదిక‌ (Leeds Venue)గా జూన్ 20న ఇంగ్లండ్‌ (England)తో ప్రారంభం కానున్న తొలి టెస్టు (First Test)కు ముందు టీమిండియా (Team India)కు శుభవార్త అందింది. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా స్వదేశానికి వచ్చేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), తిరిగి మంగళవారం భారత జట్టుతో కలవనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

గంభీర్ తిరిగి ప్రయాణం
ఏఎన్‌ఐ (ANI) వర్గాల సమాచారం ప్రకారం.. గంభీర్ సోమవారం (జూన్ 17) లండన్‌ (London)కు బయలుదేరినట్లు తెలుస్తోంది. ఈ సిరీస్ కోసం గంభీర్ జూన్ 5న భారత జట్టుతో పాటు ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అతడి నేతృత్వంలో భారత జట్టు నాలుగు రోజుల ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొంది. అయితే తన తల్లి గుండెపోటుతో అస్పత్రిలో చేరడంతో గౌతీ ఉన్నపళంగా జూన్ 11న స్వదేశానికి వచ్చేశాడు. ఇప్పుడు అతడి తల్లి ఆరోగ్యం మెరుగుపడడంతో గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు పయనమైనట్లు తెలుస్తోంది.

లక్ష్మణ్ పర్యవేక్షణలో ప్రాక్టీస్
గంభీర్ లేకపోవడంతో భారత జట్టు తమ ప్రాక్టీస్‌ను బీసీసీఐ (BCCI) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ (Centre of Excellence Head) వీవీఎస్ లక్ష్మణ్ (VVS Laxman) ఆధ్వర్యంలో కొనసాగించింది. క్రిక్‌బజ్ రిపోర్ట్స్ ప్రకారం.. టీమిండియా సన్నాహాలను లక్ష్మణ్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. లక్ష్మణ్ భారత జట్టుతో కాకుండా తన వ్యక్తిగత పనుల మీద ఇంగ్లండ్‌కు వెళ్లాడు. కానీ గంభీర్ ఉన్నపళంగా స్వదేశానికి వెళ్లిపోవడంతో లక్ష్మణ్ లౌసాన్ నుండి లండన్‌కు వచ్చినట్లు క్రిక్‌బజ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.

తొలి టెస్టుకు సన్నద్ధం:
ఇక తొలి టెస్టుకు శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సారథ్యంలోని (Captaincy) భారత జట్టు అన్నివిధాలా సిద్ధమైంది. ఈ టెస్టుకు ముందు జరిగిన ఇంట్రాస్క్వాడ్ మ్యాచ్‌లో భారత సీనియర్, భారత-ఎ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాహుల్, గిల్, శార్దూల్ ఠాకూర్ వంటి ఆటగాళ్లు మెరుగ్గా రాణించారు. కాగా ఈ సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.

ఇంగ్లండ్‌తో సిరీస్‌కు భారత జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్)
రిషబ్ పంత్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్)
యశస్వి జైస్వాల్
కేఎల్ రాహుల్
సాయి సుదర్శన్
అభిమన్యు ఈశ్వరన్
కరుణ్ నాయర్
నితీష్ కుమార్ రెడ్డి
రవీంద్ర జడేజా
ధ్రువ్ జురెల్
శార్దూల్ సింగ్ ఠాకూర్
వాషింగ్టన్ సుందర్
జస్ప్రీత్ బుమ్రా
ఆకాష్ దీప్
ప్రసిధ్ కృష్ణ
మొహమ్మద్ సిరాజ్
కుల్దీప్ యాదవ్
అర్షదీప్ సింగ్

Join WhatsApp

Join Now

Leave a Comment