ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh)కూటమి ప్రభుత్వం (Coalition Government) అధికారంలోకి వచ్చిన తరువాత కొందరు ఐఏఎస్(IAS), ఐపీఎస్ (IPS) అధికారుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో (YSRCP Government) కీలకంగా వ్యవహరించిన పలువురు అధికారులకు కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు పోస్టింగులే ఇవ్వలేదు. కొందరిని వీఆర్ కు(VR) పరిమితం చేయగా, మరికొందరిని సుదీర్ఘకాలంగా సస్పెన్షన్‌లోనే (Suspension) ఉంచింది. ఈ క్రమంలోనే, గత రెండేళ్లుగా పోస్టింగ్ లేకుండా, సస్పెన్షన్ ఎదుర్కొంటున్న 1993 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి. సునీల్ కుమార్ (P. V. Sunil Kumar) సస్పెన్షన్‌లో ఉండగానే సర్వీస్ నుండి రిలీవ్ అయ్యారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‌గా (CID Chief) అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వర్తించిన పి.వి. సునీల్ కుమార్‌కు చంద్రబాబు (Nara Chandrababu Naidu) ప్రభుత్వం (Government) అధికారంలోకి వచ్చాక పోస్టింగ్ (Posting) ఇవ్వకుండా పక్కన పెట్టింది. అనంతరం పలు వివాదాలు, కేసుల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సస్పెన్షన్ కాలాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే పొడిగిస్తూ వస్తుందన్న ఆరోపణల నేపథ్యంలోనే.. చివరకు ఆయన పదవీ కాలం ముగిసిపోయింది. జూన్ 30 నాటికి ఆయన సూపర్ యాన్యువేషన్ తో (Superannuation) అధికారికంగా పదవీ విరమణ (Retirement) పొందనున్నారు.
పి.వి. సునీల్ కుమార్ రిటైర్ అయినప్పటికీ, ఆయనపై ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న క్రమశిక్షణా చర్యలు, క్రిమినల్ కేసుల విచారణలు పదవీ విరమణ తర్వాత కూడా యథావిధిగా కొనసాగుతాయని చంద్రబాబు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విచారణ ప్రక్రియ అంతా ఆల్ ఇండియా సర్వీసెస్ (డిసిప్లిన్ అండ్ అప్పీల్) రూల్స్, 1969, ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్-కమ్-రిటైర్మెంట్ బెనిఫిట్స్) రూల్స్, 1958 ప్రకారం ముందుకు సాగుతుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది.
సునీల్ కుమార్‌కు చెల్లించాల్సిన పెన్షన్ (Pension), ఇతర పదవీ విరమణ ప్రయోజనాలు కూడా సదరు 1958 నిబంధనల్లోని రూల్ 16తో పాటు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు జారీ చేసే మార్గదర్శకాలకు అనుగుణంగానే నిర్ణయించబడతాయని వెల్లడించింది. ఈ మేరకు అవసరమైన తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని(DGP) ప్రభుత్వం ఆదేశించింది.
రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసే కారణమా?
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నరసాపురం ఎంపీ, ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును (Raghurama Krishnam Raju) సీఐడీ కస్టడీలో కొట్టారనే ఆరోపణల కేసులో సునీల్ కుమార్‌ను ఏపీ ప్రభుత్వం ప్రధాన నిందితుడిగా చేర్చిన సంగతి తెలిసిందే. అగ్రిగోల్డ్ నిధుల (AgriGold Funds) దుర్వినియోగం, అనుమతి లేకుండా విదేశీ పర్యటనలు చేయడం వంటి పలు అంశాలపై ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కేసులన్నీ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే తెరమీదకు తెచ్చారని పీవీ సునీల్ కుమార్‌తో పాటు ఆయన మద్దతుదారులు బహిరంగంగానే చెబుతున్నారు.








బీరు హెల్దీ డ్రింకా?.. ‘బీచ్ షాక్స్’ కోసం నేతల తిప్పలు