5 రాష్ట్రాల ఎన్నికల హీట్ పీక్స్‌కు.. ప్రచారం ముగింపు దశలో పార్టీలు!

5 రాష్ట్రాల ఎన్నికల హీట్ పీక్స్‌కు.. ప్రచారం ముగింపు దశలో పార్టీలు!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరి, అస్సాంలో ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. తదుపరి ఎన్నికలు ఈ నెల 23న పశ్చిమ బెంగాల్‌లో కొన్ని స్థానాల్లో, తమిళనాడులో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. దీంతో రెండు రాష్ట్రాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారం ముగియనుంది. తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్‌లోని 152 స్థానాలకు మొదటి విడత పోలింగ్ ఏప్రిల్ 23న జరగనుంది.

మంగళవారం సాయంత్రానికి ఎన్నికల ప్రచారం ముగియనుండడంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఉదయం నుంచే అభ్యర్థులంతా ప్రచారం నిర్వహించనున్నాయి. చివరి సారిగా ఓటర్లను ప్రసన్నం చేసుకోనున్నారు. తమిళనాడులో 234 నియోజకవర్గాల్లో 4,023 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక రెండో విడతలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో 142 స్థానాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. అనంతరం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మాత్రం మే 4న విడుదల కానున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment