నామినేషన్ల వేళ వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు!

నామినేషన్ల వేళ వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులు!

Summarize with AI

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు సాయికుమార్‌, పుష్పమణిపై టీడీపీ కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ తరఫున నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్లిన మహిళను టీడీపీ నాయకులు అడ్డుకుని నామినేషన్‌ పత్రాలను చించేశారు. ఆమెపై దాడి జరిగినట్టు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

వివరాల మేరకు.. ధర్మవరంలో వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు సాయికుమార్‌, పుష్పమణిపై టీడీపీ, బీజేపీ కూటమి నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో పుష్పమణికి తీవ్ర గాయాలయ్యాయని, ఆమెను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారని వైసీపీ నేతలు తెలిపారు. అభ్యర్థుల నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కెళ్లారని, పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు.

టెంపుల్ సిటీ తిరుప‌తిలో..
ఇక తిరుపతిలోని మోర్‌ సూపర్‌ మార్కెట్‌ వద్ద నామినేషన్‌ దాఖలు చేసేందుకు వెళ్తున్న వైసీపీ అభ్యర్థిని టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో మహిళ జుట్టు పట్టుకుని లాగడంతోపాటు అసభ్యంగా ప్రవర్తించారని, ఆమె చేతిలోని నామినేషన్‌ పత్రాలను చింపివేశారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిందని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనలపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును అడ్డుకోవడం సరికాదని, అభ్యర్థులు స్వేచ్ఛగా నామినేషన్లు దాఖలు చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరింది.

వైఎస్సార్ జిల్లాలో
వైఎస్సార్‌ జిల్లాలోని కడపలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ కార్పొరేటర్‌ బాలస్వామిరెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తన సోదరి తరఫున వైసీపీ నుంచి నామినేషన్‌ వేయించారనే కారణంతో ఆయనపై దాడి చేశారని, రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో)కు సమర్పించిన నామినేషన్‌ పత్రాలను సైతం లాక్కొని చించివేశిన టీడీపీ నాయకులు. టీడీపీ జోనల్‌ ఇన్‌చార్జ్‌ శ్రీనివాసులురెడ్డి ఆదేశాలతోనే రెచ్చిపోయిన తెలుగుదేశం కార్యకర్తలు. ఆర్వోకు సమర్పించిన పత్రాలను చించివేస్తున్నా పోలీసులు, ఎన్నికల అధికారులు స్పందించలేదని సమాచారం. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment