అనిరుధ్ – కావ్యా మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్

అనిరుధ్ – కావ్యా మారన్ డెస్టినేషన్ వెడ్డింగ్

Summarize with AI

ఒకవైపు తన దంచికొట్టే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లతో, చార్ట్‌బస్టర్ సాంగ్స్‌తో భారతీయ సినిమా రంగాన్ని షేక్ చేస్తున్న రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇంకోవైపు తన చిరునవ్వుతో, ఐపీఎల్ స్టేడియంలలో చరిష్మాటిక్ ఆటిట్యూడ్‌తో మిలియన్ల మంది గుండెలను కొల్లగొట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అధినేత.

ఇప్పుడు వీరిద్దరి పెళ్లి గురించిన వార్త యావత్ సౌత్ ఇండియాలోనే కాక, దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. బిగ్ సస్పెన్స్ మిస్టరీలా సాగిన ఈ లవ్ స్టోరీ, ఇప్పుడు గ్రీస్ లోని కలల వేదికపై గ్రాండ్ క్లైమాక్స్‌కు చేరుకోబోతోంది.

గ‌తంలో ఈ ఇద్దరి పెళ్లి వార్తలపై అనిరుధ్ స్వయంగా “చిల్ అవుట్ గైస్, డోంట్ స్ప్రెడ్ రూమర్స్” అని ట్వీట్ చేసి కొట్టిపారేసినా.. తెరవెనుక మాత్రం ప్రేమ కథ పక్కాగా పట్టాలెక్కింది.

సన్‌రైజర్స్ నెట్‌వర్క్ బాస్ కళానిధి మారన్ కుటుంబం ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తమ కుమార్తె పెళ్లి రిసెప్షన్ ఆహ్వాన పత్రికను అందజేయడంతో ఈ డ్రీమ్ వెడ్డింగ్ అధికారికంగా కన్ఫర్మ్ అయింది. గ్రీస్ (Greece) ఐలాండ్స్‌లోని అద్భుతమైన ప్రకృతి ఒడిలో నవంబర్ 11న ఈ రాయల్ వెడ్డింగ్ జరగబోతోందని టాక్.

ఆ తర్వాత నవంబర్ 21న చెన్నైలోని ఐదు నక్షత్రాల హోటల్‌లో దేశంలోని బడా రాజకీయ నాయకులు, సినీ, వ్యాపార దిగ్గజాలు, క్రీడా ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ నిర్వహించనున్నారు.

సినిమా ఇండస్ట్రీలో బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. తన సృజనాత్మకతతో కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదిస్తే, కళానిధి మారన్ ముద్దుల కుమార్తె కావ్య మారన్ బిజినెస్ మైండ్‌తో, ఐపీఎల్ టీమ్ బిగ్ బాస్‌గా తన సత్తా చాటారు.

తమిళనాడు, తెలంగాణ సహా దక్షిణాదికి చెందిన ముఖ్యమంత్రులు, సూపర్‌స్టార్ రజనీకాంత్, దళపతి విజయ్ వంటి సినీ దిగ్గజాలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. మ్యూజిక్ పవర్ హౌస్ – కార్పొరేట్ పవర్ హౌస్‌లు ఒక్కటవుతున్న ఈ వెడ్డింగ్ ఈవెంట్.. ఈ ఏడాదిలోనే అత్యంత అట్టహాసంగా జరిగే ‘రాయల్ వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్’గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment