జనసేనలో(Jana Sena) కోట్ల రూపాయల ఉద్యోగాల స్కామ్ (Jobs Scam) వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. పోలీసుల కస్టడీలో(Police Custody) తనను చిత్రహింసలకు గురిచేశారని బోడపాటి ధరణీకృష్ణ(Bodapati Dharani Krishna) జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)ను ఆశ్రయించారు. సుమారు 56 గంటలపాటు అక్రమంగా నిర్బంధించి(Illegal Detention), ప్రైవేట్ భాగాలపై(Private Parts) కూడా దాడి చేశారని నవంబర్ 19న సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంలో ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ (కేకే), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి కోట రుక్మిణి(Kota Rukmini), డాక్టర్ నరేష్(Dr. Naresh), నిమ్మకాయల పెదిరాజు(Nimmakayala Pediraju) ప్రమేయం ఉందని ఆరోపించారు.
నవంబర్ 13న డాక్టర్ నరేష్(Dr. Naresh) సూచనతో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన తనను అక్కడే నిర్బంధించారని ధరణీకృష్ణ (Dharani Krishna) పేర్కొన్నారు. సీఐ చి. వెంకటేశ్వర్లు(Ch. Venkateswarlu), హెడ్ కానిస్టేబుల్ శ్యామ్ (Shyam) రబ్బరు బెల్టులు, కర్రలతో శరీరంలోని పలు భాగాలపై విచక్షణారహితంగా కొట్టారని తెలిపారు. ఆ సమయంలో కేకే వీడియో కాల్లో ఉంటూ పోలీసులకు సూచనలు ఇచ్చారని, ఆయనకు నచ్చిన వ్యక్తుల పేర్లు చెప్పాలంటూ ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
నవంబర్ 14న ఎస్ఐ రవితేజ(Ravi Teja), హెడ్ కానిస్టేబుల్ శ్యామ్, కానిస్టేబుల్ సురేష్(Suresh), మహిళా కానిస్టేబుల్ రియా(Riya) తనను ఆకుపచ్చ రంగు హ్యుందాయ్ ఎక్స్టర్ వాహనంలో హైదరాబాద్‌కు తీసుకెళ్లారని పేర్కొన్నారు. అనంతరం గుంటూరులోని పోలీస్ క్వార్టర్స్‌తో పాటు గుర్తుతెలియని ప్రాంతాలకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారని, తనను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు.
నవంబర్ 13 ఉదయం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకు సుమారు 56 గంటలపాటు నిర్బంధించి, మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచలేదని తెలిపారు. తన తల్లి గార్గ నాగమణి(Garga Nagamani) హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేసిన అనంతరం విడుదల చేశారని పేర్కొన్నారు.
పోలీసుల నిర్బంధం నుంచి విడుదలైన అనంతరం నవంబర్ 16న విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ధరణీకృష్ణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ఫిర్యాదు ప్రకారం వైద్యులు జారీ చేసిన మెడికో లీగల్ కేసు (MLC No.46) నివేదికలో కుడి మణికట్టు, కుడి కాలుపై వాపు, రెండు తొడలపై గాయాలు, రాపిడులు, వెన్నునొప్పి నమోదయ్యాయి. పోలీసు సిబ్బంది రబ్బరు కర్రతో కొట్టడంతో పాటు ప్రైవేట్ భాగాలపై దాడి చేశారని ధరణీకృష్ణ వైద్యులకు తెలిపిన వివరాలను కూడా వైద్య రికార్డులో పొందుపరిచారు.
వైద్య నివేదికతో పెనమలూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినా ఎస్ఐ సురేష్ తన ఫిర్యాదును స్వీకరించలేదని, ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి నిరాకరించారని ధరణీకృష్ణ పేర్కొన్నారు.
నవంబర్ 11న కేకే, కోట రుక్మిణి ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో తనపై క్రైమ్ నంబర్లు 497/2026, 498/2026తో రెండు కేసులు నమోదు చేశారని ధరణీకృష్ణ తెలిపారు. నిమ్మకాయల పెదిరాజు తదితరుల ద్వారా ఉద్యోగార్థులకు మధ్యవర్తిగా వ్యవహరించానని, ఈ వ్యవహారంలో అసలు సూత్రధారుల పేర్లు బయటకు రావడంతో మొత్తం బాధ్యతను తనపైకి నెట్టి బలిపశువును చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమ నిర్బంధం, కస్టడీ చిత్రహింసలు, లైంగిక వేధింపులు, ప్రాణహాని బెదిరింపులపై సీబీఐతో స్వతంత్ర విచారణ జరిపించాలని ధరణీకృష్ణ ఎన్హెచ్ఆర్సీని కోరారు. సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు కేకే, కోట రుక్మిణి, డాక్టర్ నరేష్ పాత్రపై దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు. సీసీటీవీ ఫుటేజీ, కాల్ డేటా రికార్డులు, వీడియో కాల్ వివరాలు, వాహన ప్రయాణ రికార్డులను భద్రపరచాలని కోరారు. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించడంతో పాటు అక్రమ నిర్బంధం, చిత్రహింసలకు పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్య నివేదికలో నమోదైన గాయాలు, రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తుల ప్రమేయంపై వచ్చిన ఆరోపణలు పోలీసు వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.








