దేశవ్యాప్తంగా బంగారం (Gold) ధరలు భారీగా తగ్గాయి. నవంబర్ 20న హైదరాబాద్(Hyderabad) మరియు విశాఖపట్నం లో(Visakhapatnam) బులియన్ మార్కెట్‌లో(Bullion Market) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.5,120 తగ్గి రూ.1,25,570కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.4,700 తగ్గి రూ.1,15,100 వద్ద నమోదైంది. ఇతర ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్‌కతాలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,25,570గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,100గా నమోదైంది. ఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,25,720గా, 22 క్యారెట్ల ధర రూ.1,15,250గా ఉంది.
మరోవైపు వెండి (Silver) ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.5,000 తగ్గి రూ.1,75,000కు చేరినట్లు అందిన సమాచారం వెల్లడిస్తోంది. అయితే బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ (International Market) పరిణామాలు, డాలర్‌తో రూపాయి మారకం విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాల ఆధారంగా నగరాలవారీగా మారుతుంటాయి. కొనుగోలుదారులు ఆభరణాలు కొనుగోలు చేసే ముందు స్థానిక జువెలరీ షోరూమ్‌లలో(Jewellery Showroom) తాజా ధరలను తెలుసుకోవాలి. పేర్కొన్న ధరలకు అదనంగా 3 శాతం జీఎస్టీ, ఆభరణాల తయారీ ఛార్జీలు వర్తిస్తాయి.








