హైదరాబాద్‌లోని(Hyderabad) జూబ్లీహిల్స్‌లో(Jubilee Hills) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఉప ముఖ్యమంత్రి, జనసేన (Jana Sena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాసం వద్ద ఓ బిల్డర్ కత్తితో హల్చల్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మంలోని గణేశ్ టౌన్‌షిప్‌కు (Ganesh Township) చెందిన బిల్డర్ భట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్(Bhattu Suchethan Thakur Naik),, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 35లో ఉన్న పవన్ కళ్యాణ్ నివాసం (Residence) వద్దకు చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్‌ను కలిసేందుకు అనుమతించాలని కోరుతూ ఓ ఫ్లెక్సీని ప్రదర్శించాడు. గత 16 రోజులుగా ఆయనను కలిసేందుకు ప్రయత్నిస్తున్నానని, తన సమస్యను వివరించేందుకు కొద్ది నిమిషాల సమయం కేటాయించాలని ఫ్లెక్సీలో(Flex Banner) పేర్కొన్నాడు. తాను తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోయానని, వాటి నుంచి బయటపడేందుకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సాయం (Financial Help) చేయాలని కోరినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో అక్కడ విధుల్లో ఉన్న బౌన్సర్లతో(Bouncers) సుచేతన్ వాగ్వాదానికి దిగాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో(Knife) వారిని బెదిరించడమే కాకుండా దాడికి యత్నించాడు. అంతటితో ఆగకుండా తన ఛాతీ, చేతులపై కత్తితో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి (Suicide Attempt) పాల్పడ్డాడు. అప్రమత్తమైన బౌన్సర్లు చాకచక్యంగా వ్యవహరించి అతడి చేతిలోని కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుచేతన్ను అదుపులోకి తీసుకున్నారు. అతడి కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, వారి సమక్షంలో కౌన్సెలింగ్ (Counselling) నిర్వహించి నచ్చజెప్పారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు సమాచారం.








