కాకినాడ జిల్లా డిప్యూటీ సీఎం ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళిత మహిళలపై దారుణ దాడి జరిగింది. భూవివాదం నేపథ్యంగా ఇద్దరు మహిళలపై ఇద్దరు వ్యక్తులు దాడికి తెగబడ్డారు. జ్యోతుల శివప్రసాద్, వీరబాబు దాడి చేసిన ఘటన వెలుగుచూసింది. బాధితులైన కండవల్లి చక్రమ్మ, తిరగటి కుమారి తమ సెంటున్నర భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేశారని ఆరోపించారు.
తమ స్వంత భూమిపై వేసిన ఐరన్ ఫెన్సింగ్‌ను తొలగిస్తున్న సమయంలో నిందితులు అక్కడికి చేరుకుని ఇద్దరు మహిళలపై దాడికి దిగారు. దాడిలో మహిళలు గాయపడి తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై బాధితులు గొల్లప్రోలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితులైన శివప్రసాద్, వీరబాబులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.









ఇకపై ‘దొరసాని’ని చూస్తారు – కవితపై బీజేపీ ఎంపీ సెటైర్లు