హైదరాబాద్‌కు గ్లోబల్ డేటా హబ్.. 40 ఎకరాల్లో నిర్మాణం

హైదరాబాద్‌కు గ్లోబల్ డేటా హబ్.. 40 ఎకరాల్లో నిర్మాణం

Summarize with AI

హైదరాబాద్‌ ఐటీ రంగానికి కొత్త ఊపిరినిస్తూ ప్రముఖ డేటా సొల్యూషన్స్‌ సంస్థ కంట్రోల్‌ ఎస్‌ చైర్మన్ శ్రీధర్‌ పిన్నపురెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ నగర శివారులో 40 ఎకరాల్లో విస్తరించనున్న భారీ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు.

ఈ కొత్త డేటా సెంటర్‌ పూర్తిస్థాయి సామర్థ్యం 600 మెగావాట్లు కాగా, చందనవెల్లి పారిశ్రామిక పార్కులో దీన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసరాల్లోని కంట్రోల్‌ ఎస్‌ డేటా సెంటర్ల సామర్థ్యం కేవలం 52 మెగావాట్లేనని, ఈ కొత్త కేంద్రంతో నగరానికి మరింత డిజిటల్‌ బలాన్ని అందిస్తామని తెలిపారు.

అధునాతన సాంకేతికత
ఈ సెంటర్‌ అత్యాధునిక శీతలీకరణ వ్యవస్థలతో రూపొందించబడుతుందని, పర్యావరణానికి హాని కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని హైటెక్‌సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఇప్పటికే 3 డేటా సెంటర్లను కంట్రోల్‌ ఎస్‌ విజయవంతంగా నిర్వహిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment