‘పవన్ ఓ ప్యాకేజీ స్టార్‌’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

'పవన్ ఓ ప్యాకేజీ స్టార్‌'.. కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan), తెలంగాణ ఉద్య‌మ‌కారులు, జ‌ర్న‌లిస్టులు మ‌ధ్య వివాదం ముదురుతోంది. ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావును (Nageshwar Rao) ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌న‌సేన నేత‌లు విమ‌ర్శ‌లు చేయ‌డంతో ప్రొఫెస‌ర్‌కు తెలంగాణ నుంచి అనూహ్య మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. జ‌ర్న‌లిస్టులు, ప్ర‌జాసంఘాలు, ఉద్య‌మ‌కారులు మ‌ద్ద‌తు తెలుపుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ అధికార పార్టీ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి (Anirudh Reddy) సైతం నాగేశ్వ‌ర‌రావుకు స‌పోర్ట్‌గా నిల‌బ‌డ్డారు.

ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావుపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అనిరుధ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ను ‘ప్యాకేజీ స్టార్'(Package Star) అని అభివర్ణిస్తూ.. తెలంగాణ మేధావులను ముట్టుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. “పవన్ కల్యాణ్ కేవలం ప్యాకేజీల కోసమే ఎవరితోనైనా పొత్తులు పెట్టుకుంటారు. రేపు వైఎస్ జగన్ గనుక ఎక్కువ ప్యాకేజీ ఇస్తే.. ఆయనకు కూడా సపోర్ట్ చేయడానికి పవన్ సిద్ధపడతారు” అని ఆరోపించారు.

తెలంగాణకు (Telangana) చెందిన ప్రముఖ విద్యావేత్త, రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును విమర్శించే అర్హత పవన్ కల్యాణ్‌కు లేదని మండిపడ్డారు. “దమ్ముంటే తెలంగాణకు వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ రావును అరెస్ట్ చేయండి. నేనే స్వయంగా ఆయన ఇంటి ముందు నిలబడి ఆ అరెస్టును అడ్డుకుంటా. అవసరమైతే నేనే ముందు అరెస్ట్ అవుతా. తెలంగాణ బిడ్డలను, ఇక్కడి మేధావులను ముట్టుకోవాలని ఆంధ్ర నుండి ఎవరైనా వస్తే.. ఇక్కడ మళ్లీ ‘గో బ్యాక్ ఆంధ్ర’ (Go Back Andhra) ఉద్యమం మొదలవుతుంది” అని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఉండేది హైదరాబాద్‌లోనే కదా.. అమరావతి ఎందుకు?
అమరావతి నిర్మాణంపై (Amaravati Construction) కూడా అనిరుధ్ రెడ్డి ఈ సందర్భంగా కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “అసలు అమరావతి కోసం అన్ని వేల కోట్లు ఎందుకు తగలేస్తున్నారు? ఆంధ్రాకు చెందిన పెద్ద నాయకులు, సెలబ్రిటీలు అందరూ ఉండేది హైదరాబాద్‌లోనే కదా? ఇక్కడే ఉంటూ అక్కడ అన్ని డబ్బులు పెట్టి అమరావతి ఎందుకు కట్టుకుంటున్నారు?” అంటూ ఆయన ప్రశ్నించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment