బీర్ బాటిల్లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబుల‌కు షాక్‌

బీర్ బాటిల్లో కండోమ్ ప్యాకెట్.. మందుబాబుల‌కు షాక్‌

Summarize with AI

మందుబాబుకు బీర్ బాటిల్ (Beer Bottle) షాకిచ్చింది. సిద్ధిపేట జిల్లాలోని అక్బర్‌పేట్ భూంపల్లి మండల కేంద్రంలో ఒక విస్తుపోయే సంఘటన వెలుగుచూసింది. స్థానిక వైన్స్ షాపులో ఒక వినియోగదారుడు కింగ్ ఫిషర్ (Kingfisher) బీర్(Beer) కొనుగోలు చేశాడు. అయితే, ఆ బాటిల్‌ను గమనించిన సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సీల్ చేసి ఉన్న ఆ బీర్ బాటిల్ లోపల ఒక ఖాళీ కండోమ్ ప్యాకెట్ (Empty Condom Packet) స్పష్టంగా కనిపించింది.

బాటిల్ లోపల కండోమ్ ప్యాకెట్ ఉండటాన్ని చూసి ఆశ్చర్యపోయిన సదరు వినియోగదారుడు.. వెంటనే ఈ విషయమై వైన్స్ షాప్ నిర్వాహకులను (Wine Shop Management) నిలదీశాడు. అయితే, యాజమాన్యం దీనిపై ఏమాత్రం బాధ్యత లేకుండా, నిర్లక్ష్యంగా సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. షాప్ నిర్వాహకుల స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితుడు, అతనికి మద్దతుగా మరికొందరు వినియోగదారులు వైన్స్ షాప్ ముందు ఆందోళనకు దిగారు. ప్రముఖ బ్రాండ్ల బీర్ బాటిళ్లలోనే ఇలాంటి వ్యర్థాలు రావడంపై మండిపడ్డారు.

వైన్స్ షాప్ ముందు ఆందోళన జరుగుతోందనే సమాచారం అందుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు (Excise Department Officials) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వివాదాస్పద బీర్ బాటిల్‌ను పరిశీలించిన అధికారులు, బాధితుల నుంచి వివరాలు సేకరించారు.

బీర్ బాటిల్ లోపలికి ఆ ప్యాకెట్ ఎలా వచ్చింది? అది ప్యాకింగ్ సమయంలో జరిగిన పొరపాటా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో సమగ్ర విచారణ జరుపుతామని అధికారులు హామీ ఇచ్చారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించడంతో వినియోగదారులు ఆందోళన విరమించారు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల డ్రింక్స్, బీర్లలో ఇలాంటివి రావడంపై మద్యం ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment