గుంటూరు (Guntur) వెస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే(TDP MLA) గల్లా మాధవి (Galla Madhavi) భర్త, ‘శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్’ (Sri Bhramara Real Estate) అధినేత గల్లా రామచంద్రరావుపై (Galla Ramachandra Rao) కలెక్టర్ ప్రజాసమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)లో (Grievance) ఫిర్యాదు నమోదైంది. ప్లాట్ల అమ్మకం పేరుతో తమను మోసగించారని ఆరోపిస్తూ బాధితులు జిల్లా కలెక్టర్‌తో పాటు వినుకొండ ఎమ్మెల్యే, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు (Lavu Sri Krishna Devarayalu) కూడా ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
వినుకొండలోని ‘శ్రీ భ్రమర రియల్ ఎస్టేట్’ (Sri Bhramara Real Estate) వెంచర్‌లో ప్లాట్లు కొనుగోలు చేసే సమయంలో గల్లా రామచంద్రరావు మాయమాటలు చెప్పి తమను నమ్మించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు.
సదరు వెంచర్‌లో కనీస మౌలిక వసతులు కూడా కల్పించలేదని బాధితులు వాపోతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ(Drainage System), మంచినీటి సదుపాయం (Drinking Water Facility), విద్యుత్ కనెక్షన్లు (Electricity Connections) లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై ఇప్పటికే వినుకొండ ఎమ్మెల్యేకు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం లభించలేదని తెలిపారు.
అధికారుల చుట్టూ, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధితులు మరోసారి కలెక్టరేట్ గ్రీవెన్స్‌లో అధికారికంగా ఫిర్యాదు అందించారు. “ప్లాట్ల పేరుతో మమ్మల్ని నమ్మించి మోసం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మాకు వెంటనే న్యాయం చేయాలి. ఈసారి కూడా మా సమస్య పరిష్కారం కాకపోతే బాధితులమంతా ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం” అని హెచ్చరించారు.








