సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. జగన్ బాటలో ‘దళపతి’!

సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. జగన్ బాటలో 'దళపతి'!

తమిళనాడు (Tamil Nadu) ముఖ్యమంత్రిగా(Chief Minister) బాధ్యతలు చేపట్టిన ‘దళపతి’ విజయ్ (Vijay) తన మార్క్ పాలనను(Governance) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా సామాన్య ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా మహిళలు(Women), విద్యార్థుల (Students) భద్రతను (Safety) దృష్టిలో ఉంచుకుని మద్యం దుకాణాల విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రార్థనా మందిరాలు, విద్యాసంస్థల సమీపంలో ఉన్న వందలాది మద్యం దుకాణాలను (Liquor Outlets) మూసివేయాలని ఆయన ఆదేశించారు.

500 మీటర్ల నిబంధన.. 717 దుకాణాలకు తాళం!
మంగళవారం తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. దేవాలయాలు, మసీదులు, చర్చిలు, పాఠశాలలు, కళాశాలలు మరియు బస్టాండ్‌లకు 500 మీటర్ల పరిధిలో ఎలాంటి మద్యం దుకాణాలు ఉండకూడదు. తమిళనాడు రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ (TASMAC) ఆధ్వర్యంలో నడుస్తున్న దుకాణాల్లో ఈ పరిధిలోకి వచ్చే వాటన్నింటినీ రెండు వారాల్లోగా మూసివేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 4,765 మద్యం దుకాణాలు ఉండగా, తాజా నిర్ణయంతో 717 దుకాణాలు శాశ్వతంగా మూతపడనున్నాయి. ఇందులో 276 ప్రార్థనా స్థలాల వద్ద, 186 విద్యాసంస్థల సమీపంలో, మరో 255 బస్టాండ్‌ల వద్ద ఉన్నట్లు గుర్తించారు.

జగన్ బాటలో విజయ్..సోషల్ మీడియాలో చర్చ
ముఖ్యమంత్రి విజయ్(CM Vijay) తీసుకున్న ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) 2019లో తీసుకున్న నిర్ణయాలను గుర్తుకు తెస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. “జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే జనావాసాల మధ్య ఉన్న మద్యం దుకాణాలను తొలగించారు. బడి, గుడికి దూరంగా ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇప్పుడు విజయ్ కూడా అదే బాటలో పయనిస్తున్నారు” అంటూ వైసీపీ(YSRCP) మద్దతుదారులు అప్పటి జీవోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

‘సరైన నిర్ణయం’ – కమల్ హాసన్ అభినందనలు
విజయ్ నిర్ణయాన్ని లోకనాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) మనస్ఫూర్తిగా స్వాగతించారు.”ప్రార్థనా స్థలాలు, విద్యాసంస్థల వద్ద మద్యం దుకాణాలను తొలగించాలని తమిళ ప్రజలు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. సోదరుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఈ దిశగా అడుగులు వేయడం అభినందనీయం. మద్యం అమ్మకాలు ప్రభుత్వ విధి కాకూడదు, కేవలం నియంత్రణ మాత్రమే ఉండాలి. ఈ ప్రక్రియ 717 దుకాణాలతో ఆగిపోకూడదు, నిరంతరాయంగా కొనసాగాలి” అని కమల్ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా పిలుపునిచ్చారు.

Join WhatsApp

Join Now

Leave a Comment