ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) డిప్యూటీ సీఎం, జనసేన(Jana Sena)అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తెలంగాణ పర్యటన, ఆయన సభలపై అక్కడి పార్టీల నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ ముఖ్యమంత్రి(AP CM) నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) స్పందించారు. తెలంగాణలోని (Telangana) కొందరు నేతలు అనవసర అంశాలను ప్రస్తావిస్తూ సరిహద్దుల పంచాయతీ రాజేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో (Democracy) ఎవరైనా, ఎక్కడైనా రాజకీయాలు చేసుకునే హక్కు ఉంటుందని, ఇలాంటి విమర్శలు మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్‌ను చంద్రబాబు సమర్థించారు.
రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు గడిచిపోయాయని, రెండు రాష్ట్రాలు తమ తమ బాటల్లో అభివృద్ధి చెందుతున్నాయని చంద్రబాబు గుర్తు చేశారు. “తెలంగాణలో పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు, సభలకు అడ్డంకులు సృష్టించడం ఏమాత్రం సరైన విధానం కాదు. ఇలాంటి మాటల వల్ల లేనిపోని సమస్యలు సృష్టించడమే తప్ప ఉపయోగం లేదు.”
“విభజన (Bifurcation) జరిగి ఇన్నేళ్లవుతున్నా, కొందరు నాయకులు ఇంకా పాత విషయాలను లాగుతూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టాలని చూడటం సరికాదు. ఏ ప్రాంతానికి ఎవరు ఏం చేశారో ప్రజలకు అన్నీ బాగా తెలుసు” అని సీఎం చంద్రబాబు(Chandrababu) స్పష్టం చేశారు.
ప్రజలకు ఎవరు మెరుగైన సేవలందిస్తారో.. వాళ్లే ఆయా ప్రాంతాల్లో లీడర్స్ అవుతారని చంద్రబాబు చెప్పారు. రాజకీయ పార్టీలు విమర్శలు, విద్వేషాల్లో కాకుండా.. అభివృద్ధిలో, ప్రజా సేవలో పోటీ పడాలని, ప్రజలకు ఎవరు మంచి సేవలు అందిస్తారనే దానిపై దృష్టి పెట్టాలన్నారు. మరి చంద్రబాబు ఇచ్చిన ఈ కౌంటర్‌పై తెలంగాణ(Telangana) పొలిటికల్ సర్కిల్స్ (Political Circles) ఎలా స్పందిస్తాయో చూడాలి.








