మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా, బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’(Peddi) బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తోంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ యాక్షన్ స్పోర్ట్స్ డ్రామాకు తొలి షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో అభిమానులు థియేటర్ల వద్ద సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చిత్ర యూనిట్‌కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో (Pollachi) ఉన్నప్పటికీ, తన మనసంతా ‘పెద్ది’ విజయోత్సాహంలోనే ఉందని పేర్కొన్నారు.
రామ్ చరణ్ ఈ సినిమా కోసం రెండేళ్లుగా చేసిన కృషిని గుర్తు చేసుకున్న చిరంజీవి(Chiranjeevi), ‘పెద్ది’ పాత్ర కోసం చరణ్ అహర్నిశలు శ్రమించాడని తెలిపారు. ఆ పాత్రలో పూర్తిగా లీనమై నటించిన తీరుకు ప్రేక్షకులు అందిస్తున్న అపారమైన ప్రేమను చూస్తుంటే తండ్రిగా(Father) మాత్రమే కాకుండా నటుడిగా (Actor) కూడా గర్వంగా ఉందని అన్నారు. అలాగే హీరోయిన్ జాన్వీ కపూర్(Janhvi Kapoor), కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్(Shivarajkumar), జగపతిబాబు (Jagapathi Babu) సహా చిత్ర బృందం మొత్తం అద్భుతంగా పనిచేసిందని ప్రశంసించారు. ఇలాంటి శక్తివంతమైన కథను రూపొందించి వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చిబాబు సానాకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రస్తుతం చిరంజీవి చేసిన ఈ ఎమోషనల్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.







