‘లేడీ సూపర్‌స్టార్’ నయనతారకు వరుస ఎదురుదెబ్బలు

‘లేడీ సూపర్‌స్టార్’ నయనతారకు వరుస ఎదురుదెబ్బలు

Summarize with AI

నయనతార (Nayanthara) పేరు చెబితే ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదిలేది ‘లేడీ సూపర్‌స్టార్‌’(Lady Superstar) అనే ట్యాగే. ఆమె మాత్రం తనను అలా పిలవొద్దని అభిమానులను కోరుతున్నప్పటికీ, ఆ బిరుదు ఆమె స్టార్‌డమ్‌కు గుర్తుగా మారిపోయింది. అయితే 2026 మాత్రం నయనతారకు అనుకున్నంత సాఫీగా సాగడం లేదు. ఏడాది ఆరంభంలోనే ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమెకు ఆ తర్వాత వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. మెగాస్టార్ చిరంజీవితో(Megastar Chiranjeevi) కలిసి నటించిన ఈ సినిమాలో సరికొత్త లుక్‌తో ఆకట్టుకున్న నయనతారకు మంచి స్పందన లభించింది. కానీ ఆ తర్వాత వచ్చిన ‘పేట్రియాట్’లో(Patriot) ఆమె పాత్ర పరిమితంగా ఉండటంతో అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక యశ్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘టాక్సిక్’లో(Toxic) గంగ పాత్రలో కనిపించిన నయనతారకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కలేదు. ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినప్పటికీ, భారీ బడ్జెట్ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్‌గా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. అనంతరం ‘హాయ్’(Hi) చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినా, అది నయనతారకు కమర్షియల్ కమ్‌బ్యాక్‌గా నిలవలేకపోయింది.

కెమెరా ముందు పరిస్థితి ఇలా ఉంటే.. నిర్మాతగా కూడా నయనతారకు ఈ ఏడాది పెద్దగా కలిసిరాలేదు. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(Love Insurance Kompany), ‘హాయ్’(Hi) చిత్రాలకు ఆమె నిర్మాతగా వ్యవహరించినప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో 2026లో నటిగా, నిర్మాతగా నయనతారకు ఇప్పటివరకు మిశ్రమ ఫలితాలే ఎదురయ్యాయి. అయితే ఆమె కెరీర్ పూర్తిగా డౌన్‌ఫాల్‌లో ఉందని చెప్పడానికి మాత్రం పరిస్థితులు లేవు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘మూకుతి అమ్మన్ 2’, ‘డియర్ స్టూడెంట్స్’, ‘రక్కాయీ’, ‘తని ఒరువన్ 2’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ సినిమాల్లో కొన్ని మంచి విజయాలను అందుకుంటే నయనతార మరోసారి తన స్టార్‌డమ్‌ను బలంగా చాటుకునే అవకాశం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment