పీ4: కొర‌వ‌డిన ఆద‌ర‌ణ‌.. నేరుగా రంగంలోకి సీఎం

పీ4: కొర‌వ‌డిన ఆద‌ర‌ణ‌.. నేరుగా రంగంలోకి సీఎం

Summarize with AI

ఉగాది (Ugadi) రోజున ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు (Chief Minister Chandrababu), డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ (Pawan Kalyan) ప్రారంభించిన‌ ‘జీరోపావర్టీ-పీ4’ కార్యక్రమానికి ప్ర‌జ‌ల నుంచి స‌రైన ఆద‌ర‌ణ (Response) ల‌భించ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబు రంగంలోకి దిగారు. పీ4పై స‌చివాల‌యం (Secretariat) లో స‌మీక్ష చేప‌ట్టిన సీఎం.. ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకెళ్లేందుకు ‘స్టేట్ లెవెల్ సొసైటీ (State Level Society)’ని ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యమంత్రి చైర్మ‌న్‌గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్మ‌న్‌గా వ్యవహరించ‌నున్నారు. అలాగే సీఈవో, డైరెక్టర్‌తో పాటు వీరికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీమ్, ప్రోగ్రాం టీమ్, వింగ్ టీమ్ ఉండ‌నున్నాయి. జిల్లా చాప్టర్‌కు జిల్లా మంత్రి చైర్మ‌న్‌ (Chairman)గా, నియోజకవర్గానికి ఎమ్మెల్యే చైర్మ‌న్‌ (Vice Chairman) గా, గ్రామ, వార్డు స్థాయిలో సెక్రటేరియట్ చాప్టర్లకు చైర్మ‌న్‌గా పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు వ్య‌వ‌హ‌రించ‌నున్నారు.

పీ4పై ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. దాతలు ఎవరెవరు ఎంత మొత్తంలో సాయం ఇచ్చారు… ఇంకెంత సాయం ‘బంగారు కుటుంబాలు (Golden Families)’కు అవసరం అవుతుంది వంటి విషయాలు అన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో పారదర్శకంగా ఉంటుందని, పీ4పై విశ్వాసం మరింత పెరుగుతుందని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.

ఆగస్ట్ 15 నాటికి 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత (Adoption) తీసుకునేలా చూడాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా మార్గదర్శి, బంగారు కుటుంబాల నమోదు చేపడుతున్నట్టు సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం మిలాప్ (Milaap), డొనేట్‌కార్ట్ (Donatekart), రంగ్‌దే (Rang De) సంస్థలు ప్లేయర్లుగా పీ4 (P4)లో భాగస్వాములు అవుతున్నాయని తెలిపారు. దాతలు కుటుంబాలను, మండలాలను, గ్రామాలను కూడా దత్తత తీసుకోవడంతో పాటు, నిధులు సమకూర్చేలా పీ4 రూపకల్పన చేశామన్నారు. వచ్చే ఉగాది నాటికల్లా పీ4 కార్యక్రమం ద్వారా ఏడాది కాలంలో ఏం సాధించామనే దానిపై వార్షిక ప్రగతి నివేదిక విడుదల చేయాలని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment