‘ఓటుకు నోటు’ మరిచిపోయారా చంద్రబాబూ..?

ఓటుకు నోటు కేసు మరిచిపోయారా చంద్రబాబూ..?

Summarize with AI

ఎన్నికల్లో డబ్బులు (Elections Money) తీసుకోవడం మానేయాలని, అవినీతి (Corruption) సొమ్మును ఓటర్లకు (Voters) పంచడం వల్ల సమాజానికి నష్టం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మహిళలకు సూచించడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో ఓటుకు డబ్బులు తీసుకోవద్దంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో.. గతంలో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’(Vote for Note) కేసు అంశాన్ని నెటిజన్లు, రాజకీయ ప్రత్యర్థులు మరోసారి ప్రస్తావిస్తున్నారు.

తాజాగా మహిళలను (Women) ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. ఎన్నికల్లో రాజకీయ నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకోవద్దని సూచించారు. ఓటుకు రూ.2 వేలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకునే పరిస్థితి ఉంటుందని వ్యాఖ్యానించారు.

‘‘ఎందుకు ఎలక్షన్‌లో మనం డబ్బులు తీసుకోవడం మానేయలేం? మహిళల (Women) ద్వారా సమాజం మారాలి. పెనుమార్పు తీసుకురావాలి’’ అని, రాజకీయ నాయకులు వ్యాపారాలు చేసి సంపాదించిన డబ్బును కాకుండా, అవినీతి మార్గాల్లో సంపాదించిన సొమ్మును ఓటర్లకు ఇస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో డబ్బులు ఇచ్చే సమయంలోనే ‘మేము డబ్బులు తీసుకోం.. నీకు నీతి లేదు, మాకు నీతి ఉంది’ అని చెప్పగలిగితే సమాజంలో మార్పు వస్తుందని చంద్రబాబు అన్నారు.

మరి ‘ఓటుకు నోటు’ కేసు సంగతేంటి?
చంద్రబాబు (Chandrababu) తాజా వ్యాఖ్యలపై స్పందిస్తున్న నెటిజన్లు ఇప్పుడు 2015లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసును గుర్తు చేస్తున్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇవ్వజూపిన కేసులో అప్పటి టీడీపీ(TDP) నేత, ప్ర‌స్తుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలంగాణ ఏసీబీకి (Telangana ACB)చిక్కిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారానికి సంబంధించి రేవంత్ రెడ్డి(Revanth Reddy), స్టీఫెన్‌సన్ (Stephenson) మధ్య జరిగిన సంభాషణలతో పాటు మరికొన్ని ఆడియో, వీడియోలు అప్పట్లో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి. ముఖ్యంగా స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడినట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఆడియోలోని ‘బాస్’ ప్రస్తావన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అయితే, ఈ కేసులో రేవంత్ రెడ్డి నేరుగా ఏసీబీకి పట్టుబడిన విషయం కాగా, చంద్రబాబు పాత్రకు సంబంధించి ఆడియోలు, ఆరోపణలు రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు తాజా ఎన్నికల నీతి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘ఓటుకు నోటు’ వ్యవహారం వెలుగులోకి వచ్చిన సమయంలో చంద్రబాబు(Chandrababu) ‘మనవాళ్లు బ్రీఫ్డ్ మీ’(Mana Vaallu Briefed Me) వ్యాఖ్యలను కూడా నెటిజన్లు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. ఈ కేసు నేపథ్యంలోనే చంద్రబాబు హైదరాబాద్ నుంచి అమరావతికి తన రాజకీయ కార్యకలాపాలను మార్చుకున్నారనే విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. తెలంగాణ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో(KCR) చంద్రబాబు చేసిన రాజకీయ వ్యాఖ్యలు కూడా ఈ వ్యవహారంలో భాగంగా అప్పట్లో చర్చకు వచ్చాయి.

ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ విమర్శకులు చంద్రబాబు తాజా వ్యాఖ్యలను ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. ‘వంద ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్ర చేసినట్టుంది’ అంటూ కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క ఓటును ప్రభావితం చేసేందుకు రూ.50 లక్షలు ఇవ్వజూపిన కేసులో తన పార్టీకి చెందిన నేత పట్టుబడిన ఘటనను మరచిపోయారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బుల పంపిణీపై నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు సంధిస్తున్నారు.

ఎన్నికల్లో డబ్బులు పంచడం ప్రజాస్వామ్యానికి, సమాజానికి నష్టం చేస్తుందని చంద్రబాబు చెప్పడంపై అభ్యంతరం లేకపోయినా.. గతంలో తన పార్టీకి సంబంధించిన ‘ఓటుకు నోటు’ వ్యవహారంపై వచ్చిన ఆరోపణలకు కూడా అదే స్థాయిలో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని విమర్శకులు అంటున్నారు.

ప్రజలకు ఎన్నికల నీతి గురించి చెప్పే ముందు ‘ఓటుకు నోటు’ కేసులో తనపై వచ్చిన ఆరోపణలు, అప్పటి ఆడియో వివాదంపై చంద్రబాబు స్పష్టమైన వివరణ ఇస్తారా? అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఎన్నికల్లో డబ్బులు తీసుకోవద్దని ప్రజలకు సందేశం ఇచ్చే చంద్ర‌బాబు.. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఒక్క ఓటు కోసం రూ.500 ల‌క్ష‌లు పంపించి ఐయామ్ విత్ యూ అని మాట్లాడిన మాట‌ల‌ను గుర్తు చేస్తున్నారు. చంద్ర‌బాబు ద్వంద్వ వైఖరిని ప్రశ్నించేందుకు తాజా వ్యాఖ్య‌లు ప్రత్యర్థులకు మరో అస్త్రంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment