సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాల (Class 12 Results) కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు (Students) కీలక అప్‌డేట్ వచ్చేసింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 12వ తరగతి ఫలితాల విడుదలకు సర్వం సిద్ధమైంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రేపటిలోగా బోర్డు ఫలితాలను అధికారికంగా ప్రకటించనుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 17 నుండి ఏప్రిల్ 10 వరకు జరిగిన పరీక్షలకు దేశవ్యాప్తంగా మొత్తం 18,59,551 మంది విద్యార్థులు హాజరయ్యారు.
డిజీలాకర్ హింట్.. మార్క్‌షీట్లు రెడీ!
ఫలితాల విడుదలపై నిన్న డిజీలాకర్ (DigiLocker) కీలక సంకేతాన్ని ఇచ్చింది. తన అధికారిక పోర్టల్‌లో సీబీఎస్‌ఈ క్లాస్ 12 డిజిటల్ మార్క్‌షీట్‌లకు సంబంధించి “Coming Soon” అనే మెసేజ్‌ను ప్రదర్శిస్తోంది. గతేడాది మే 13న ఫలితాలు విడుదల కాగా, ఈసారి ఒక రోజు ముందే వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతేడాది మొత్తం 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ఫలితాలు పోర్టల్స్ ఇవే
విద్యార్థులు తమ స్కోర్‌కార్డులను కింది వెబ్‌సైట్లు లేదా యాప్‌ల ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చ అని అధికారులు సూచిస్తున్నారు. ఫలితాలను చూసుకోవడానికి విద్యార్థులు తమ అడ్మిట్ కార్డ్‌లో ఉన్న కింది వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలి. రోల్ నంబర్, స్కూల్ నంబర్, పుట్టిన తేదీ, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలు అందజేయాలి. విద్యార్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని బోర్డు సూచించింది.
cbse.gov.in
results.cbse.nic.in
cbseresults.nic.in
digilocker.gov.in








