సినిమాల్లో (Movies) అవకాశాలు (Opportunities) ఇప్పిస్తానని నమ్మించి, పారితోషికం (Remuneration) ఇవ్వకుండా వేధించడమే కాకుండా, లైంగిక దాడికి (Sexual Assault) యత్నించిన ఓ క్యాస్టింగ్ ఆర్టిస్ట్‌పై Casting Artist) బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ పరిశ్రమలో అవకాశాల పేరుతో జరుగుతున్న ఈ అరాచకం స్థానికంగా కలకలం రేపింది.
గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న 21 ఏళ్ల ఓ యువనటికి, ప్రసాద్ (Prasad) అనే క్యాస్టింగ్ ఆర్టిస్ట్ పరిచయమయ్యాడు. ఒక సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్(Heroine Friend Character) ఇప్పిస్తానని చెప్పి ఆమెను నమ్మించాడు. అతని మాటలు నమ్మిన సదరు యువనటి ఆ సినిమాలో నటించింది. 2025 అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా విజయవంతంగా పూర్తయింది.
షూటింగ్ పూర్తయిన తర్వాత నటికి ఇవ్వాల్సిన రూ.90 వేల రెమ్యునరేషన్(Remuneration), అలాగే రూ.38 వేల ట్రావెల్ అలవెన్స్ (Travel Allowance) ఇవ్వకుండా ప్రసాద్ కాలయాపన చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ ఏడాదిఫిబ్రవరి 18న బాధితురాలిని కలవాల్సిందిగా ప్రసాద్ కోరాడు. ఆమె రాగానే బలవంతంగా తన కారులోకి ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత అసభ్యంగా ప్రవర్తిస్తూ.. “నా కోరిక తీరిస్తేనే రాబోయే రోజుల్లో ఇతర సినిమాల్లో పెద్ద పెద్ద అవకాశాలు ఇప్పిస్తా” అంటూ సదరు నటిపై లైంగిక దాడికి ప్రయత్నించాడు.
నిందితుడి నుంచి తప్పించుకున్న యువనటి ఇంటికి చేరుకుంది. జరిగిన ఘోరాన్ని తన తల్లికి (Mother)వివరించింది. దీంతో ఆగ్రహానికి గురైన బాధితురాలి తల్లి ప్రసాద్‌ను గట్టిగా నిలదీసింది. తప్పు ఒప్పుకోవాల్సింది పోయి నిందితుడు ప్రసాద్ సదరు నటి తల్లిని కూడా తీవ్ర పదజాలంతో దూషిస్తూ బెదిరింపులకు దిగాడు. క్యాస్టింగ్ ఆర్టిస్ట్ ప్రసాద్ వేధింపులు మితిమీరడంతో, బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. నటి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడు ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు తెలిపారు.








