బూమ్రా గ్రౌండ్‌లోకి ఎంట్రీ.. వీడియో వైరల్

బూమ్రా గ్రౌండ్‌లోకి ఎంట్రీ.. వీడియో వైరల్

ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఫ్యాన్స్‌కి టీమ్‌ గుడ్ న్యూస్ చెప్పారు. స్టార్ పేసర్ జస్ప్రీత్ బూమ్రా (Jasprit Bumrah) మళ్లీ బంతిని పట్టేందుకు సిద్ధమయ్యాడు. ఐపీఎల్ 2025 సీజన్‌కు ముందే తన జట్టులోకి చేరిపోయినట్లు ముంబై ఇండియన్స్ అధికారికంగా వెల్లడించింది. “ద లయన్ ఈజ్ బ్యాక్ (“The Lion is Back”)” అనే క్యాప్షన్‌తో బూమ్రా రీ ఎంట్రీ (Re-Entry) కి సంబంధించిన ఒక స్పెషల్ వీడియో (Video) ను విడుదల చేసింది.

ఈ వీడియోలో బూమ్రా తన భార్యతో కలిసి కనిపించడంతో పాటు, తన చిన్నారి కొడుకు అంగద్‌కు తన ఐపీఎల్ జర్నీని వివరిస్తున్నట్లుగా భావోద్వేగంగా చూపించారు. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బూమ్రా గ్రౌండ్‌లోకి అడుగుపెడుతుండటం ముంబై అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.

అత్య‌ధిక సార్లు టైటిల్ (Title) గెలిచిన ముంబై జ‌ట్టు ఈ సీజ‌న్‌లో ఇటీవ‌లే గెలుపు రుచి చూసింది. ల‌క్నోతో జ‌రిగిన మ్యాచ్‌లో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. బూమ్రా రాక‌తో జ‌ట్టు విజ‌యాల బాట‌ప‌డుతుంద‌ని ఫ్యాన్స్‌, టీమ్ ఓన‌ర్స్ విశ్వ‌సిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment