బుమ్రాపై బ్రాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌.. – బౌలింగ్‌కు భ‌య‌ప‌డ్డాడా..?

బుమ్రాపై బ్రాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌.. - బౌలింగ్‌కు భ‌య‌ప‌డ్డాడా..?

Summarize with AI

భారత ఫాస్ట్ బౌలర్ (Indian Fast Bowler) జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah)ను ఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ (Australian Legendary Pacer) గ్లెన్ మెక్‌గ్రాత్‌ (Glenn McGrath)తో పోల్చాడు ఇంగ్లండ్ మాజీ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ (Stuart Broad). తన బంతులతో బ్యాటర్లను బోల్తా కొట్టించగల నైపుణ్యం బుమ్రాలో చాలా ఎక్కువగా ఉందని బ్రాడ్ అన్నాడు. బుమ్రా తక్కువ రనప్‌(Run-Up)తో బౌలింగ్ (Bowling) చేస్తాడని, అందుకే అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుందని వివరించాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో బుమ్రా అన్ని మ్యాచ్‌లూ ఆడలేడని, ఇంగ్లండ్ జట్టు కూడా అదే కోరుకుంటోందని బ్రాడ్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా ప్రత్యేకమైన యాక్షన్, నియంత్రణపై బ్రాడ్
స్టువర్ట్ బ్రాడ్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఇంగ్లండ్ బ్యాటర్ జోస్ బట్లర్‌తో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ శైలి గురించి విశ్లేషించాడు. “జస్ప్రీత్ బుమ్రా చాలా తక్కువ రనప్‌తో బౌలింగ్ చేస్తాడు. బుమ్రా రనప్‌ను చూస్తే 70 మైళ్ల వేగంతో బంతి విసిరేలా కనిపిస్తాడు కానీ.. ఆ బంతి 90 మైళ్ల వేగంతో దూసుకొస్తుంది. షోయబ్ అక్తర్ 100 మైళ్ల వేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి.. 100 మైళ్ల వేగంతో బంతులు వేసేవాడు. బుమ్రా చాలా తక్కువ రనప్‌తో బౌలింగ్ చేయడంతో అతడి బంతుల్లో నియంత్రణ ఉంటుంది. గ్లెన్ మెక్‌గ్రాత్ కూడా ఎంతో నియంత్రణగా బౌలింగ్ చేసేవాడు. ప్రస్తుతం బుమ్రా కూడా మెక్‌గ్రాత్ మాదిరే బంతులు వేస్తున్నాడు” అని బ్రాడ్ పేర్కొన్నాడు.

ఇంగ్లండ్‌కు బుమ్రా అంటే ఎందుకు భయం?
“జస్ప్రీత్ బుమ్రా ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లూ ఆడలేడు. ఇంగ్లండ్ జట్టు కూడా అదే కోరుకుంటోంది. బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడితే చాలా వికెట్లను ఖాతాలో వేసుకుంటాడు. ఒక్క ఓవర్లోనే మ్యాచ్ గమనాన్నే మార్చగల బౌలర్ అతడు. టీమిండియా అద్భుత బౌలర్లలో అందరికంటే బుమ్రా ముందుంటాడు” అని స్టువర్ట్ బ్రాడ్ ప్రశంసించాడు. వర్క్ లోడ్ కారణంగా ఇంగ్లండ్ సిరీస్‌లో బుమ్రా మూడు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే ఆడనున్నాడు. ఏ టెస్టులు ఆడుతాడో ఇంకా తెలియరాలేదు. బహుశా టెస్ట్ సిరీస్ తీవ్రతను బట్టి మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment