బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ ఆధిపత్యం, భారత బౌలర్ల పోరాటం

బాక్సింగ్ డే టెస్టు.. ఆసీస్ ఆధిపత్యం, భారత బౌలర్ల పోరాటం

భార‌త్ – ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న నాల్గ‌వ టెస్టు మ్యాచ్ (బాక్సింగ్ డే టెస్టు) టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసిస్‌ తొలి రోజు ఆట పూర్తి అయ్యేసరికి 6 వికెట్లు కోల్పోయి 311 పరుగులతో నిలిచింది. ఆసీస్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ తమ సత్తా చాటుతూ నలుగురు అర్ధసెంచరీలు నమోదు చేశారు. ప్ర‌స్తుతం క్రీజ్‌లో స్టీవ్ స్మిత్ 68 పరుగులతో నాటౌట్‌గా ఉండగా, కెప్టెన్ పాట్ కమిన్స్ 8 పరుగులతో అతనికి తోడుగా ఉన్నారు.

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా మెరుగైన ప్రదర్శన కనబర్చుతూ 3 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బతీశారు. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ తీశారు.

అభిమానుల రికార్డు హాజరు
ఈ మ్యాచ్ మొదటి రోజే 87,242 మంది అభిమానులు మైదానానికి హాజరయ్యారని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఇది ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక హాజరుగా నిలిచింది. ఈ సంఖ్య క్రికెట్ అభిమానుల ఉత్సాహాన్ని ప్రతిబింబిస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment