ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

ఏపీలో బిల్ గేట్స్‌కు రాచమర్యాదలు.. విమర్శల వెల్లువ

మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆతిథ్యంతో రాష్ట్రానికి వచ్చారు. అయితే ఆయన పర్యటన రాజకీయంగా చర్చకు దారితీసింది. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో తన పేరుపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో గేట్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలకడం కొంతమంది విమర్శలకు కారణమైంది. అలాగే భారత్‌ను తన ఉత్పత్తుల కోసం ప్రయోగశాలగా ఉపయోగిస్తున్నారనే ఆరోపణలు కూడా సోషల్ మీడియాలో వినిపించాయి.

గన్నవరం విమానాశ్రయంలో మంత్రి నారా లోకేష్ మరియు ఇతర కేబినెట్ సహచరులు గేట్స్‌కు స్వాగతం పలికారు. ఆ తర్వాత గేట్స్ రాష్ట్ర సచివాలయానికి వెళ్లి ఆరోగ్యం, వ్యవసాయం, విద్య, సాంకేతిక ఆధారిత పాలన రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసే అంశాలపై చర్చించినట్లు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు స‌హా, ప్ర‌భుత్వం నుంచి విడుద‌లైన ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

2014లో మైక్రోసాఫ్ట్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న గేట్స్ ప్రస్తుతం గేట్స్ ఫౌండేషన్ బోర్డును నడిపిస్తున్నారు. బిల్ గేట్స్ కు ఏపీ సర్కార్ రాచమర్యాదలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్య‌క్తం అవుతోంది. రష్యన్ గర్ల్స్ తో బిల్ గేట్స్ లైంగిక కార్యకలాపాల పాల్ప‌డ్డార‌ని, ఎప్ స్టీన్ సహకారంతో ఈ నీచానికి పాల్ప‌డిన‌ట్లుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఆంధ్ర‌జ్యోతి స‌హా సోష‌ల్ మీడియా, నేష‌న‌ల్ ఆరోపిస్తున్నాయి. ఆరోపణల నేపథ్యంలో తన భార్య మిలిండా గేట్స్ తో విడాకులు తీసుకున్న‌ట్లుగా చ‌ర్చ జ‌రుగుతోంది. బిల్‌గేట్స్ తన ప్రొడక్ట్స్ కి భారత్ ను ల్యాబ్ గా వాడుకుంటున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఎప్‌స్టీన్ రింగ్‌కు సంబంధించిన పత్రాల్లో గేట్స్ పేరు ప్రస్తావించబడిందని, ఆయన లైంగిక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే ఆరోపణలు వెలువడినట్లు సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. చిన్నారులపై లైంగిక దుర్వినియోగం కేసులో దోషిగా తేలిన జెఫ్రీ ఎప్‌స్టీన్ 2019లో జైలులో మరణించాడు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన సుమారు 35 లక్షల పేజీల తాజా పత్రాల్లో గేట్స్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఒక నోటులో “రష్యన్ బాలికలతో శారీరక సంబంధాల వల్ల వచ్చిన సమస్యలను ఎదుర్కొనేందుకు గేట్స్‌కు ఔషధాలు అందించడంలో సహాయం చేశాను” అని ఎప్‌స్టీన్ రాసినట్లు పేర్కొనబడింది.

ఈ ఆరోపణల నడుమ గేట్స్ భారత్ పర్యటన జరగడం విమర్శలకు దారితీసింది. “ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో పలుమార్లు పేరు వచ్చిన వ్యక్తి, తన ఉత్పత్తుల కోసం భారత్‌ను ల్యాబ్‌లా ఉపయోగిస్తున్నాడు” అంటూ సోషల్ మీడియాలో కొందరు పోస్టులు చేశారు. మధ్యప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ అనూప్ ధోటే కూడా గేట్స్‌తో సమావేశాలను తప్పించుకోవాలని వ్యాఖ్యానించారు. బిల్‌గేట్స్‌ పర్యటన సమయంలో సోషల్ మీడియాలో విమర్శాత్మక పోస్టులు మాత్రం విస్తృతంగా కనిపించాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment