బీహార్ ఎన్నికలు.. రేపు 122 స్థానాలకు మలి విడత పోలింగ్

బీహార్ ఎన్నికలు.. నేడు 122 స్థానాలకు మలి విడత పోలింగ్

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మలి విడత పోలింగ్ మంగళవారం జరగనుంది, ఇందుకోసం ఎన్నికల అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడతలో రికార్డు స్థాయిలో 65.08 శాతం పోలింగ్ నమోదు కాగా, రెండో విడతలో కూడా అదే స్థాయిలో ఓటింగ్ నమోదవుతుందని భావిస్తున్నారు.

రాష్ట్రంలోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు గాను, తొలి విడతలో 121 స్థానాలకు ఓటింగ్ పూర్తవగా, నేడు మలి విడతలో 122 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఈ విడతలో మొత్తం 3 కోట్ల 70 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల బరిలో 1,302 మంది అభ్యర్థులు (136 మంది మహిళా అభ్యర్థులు సహా) పోటీపడుతున్నారు. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి.

మహాఘట్‌బంధన్‌కు కంచుకోట
మలి విడత పోలింగ్‌లో ‘సీమాంచల్’ ప్రాంతం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ప్రాంతం ఆర్జేడీకి కంచుకోట లాంటిదిగా పేరుగాంచింది. సీమాంచల్‌లో ముస్లింలు, యాదవ్ సామాజిక వర్గాల జనాభా ఎక్కువగా ఉండడంతో, మహాఘట్‌బంధన్ కూటమి ఇక్కడ తమ విజయంపై భారీ ఆశలు పెట్టుకుంది.

గత ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే, 2020లో బీజేపీ 42, ఆర్జేడీ 33, జేడీయూ 20, కాంగ్రెస్ 11 స్థానాల్లో గెలిచాయి. అయితే, 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కూటమిగా ఉన్నప్పుడు ఏకంగా 80 స్థానాల్లో విజయం సాధించి, బీజేపీని 36 స్థానాలకే పరిమితం చేశాయి. దీపావళి, ఛత్‌ పండుగల కారణంగా బీహారీయులు సొంత గ్రామాలకు రావడంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది, ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ విజయంపై అంచనాలు వేసుకుంటున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment