
అర్నబ్ తుఫాన్(Arnab Cyclone) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) పలు జిల్లాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో(Dr. B.R. Ambedkar Konaseema District) సుమారు 6 వేల విద్యుత్ స్తంభాలు (Electricity Poles) నేలకొరిగినట్లు సమాచారం. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముందస్తు జాగ్రత్తగా కొన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సుల (RTC Buses) రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు.

తుపాను ఉగ్రరూపంతో కాకినాడ(Kakinada), కోనసీమ (Konaseema) జిల్లాల్లో తీవ్ర బీభత్సం సృష్టిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో గంటకు 145 కి.మీ. వేగంతో వీచిన ఈదురుగాలులు(Winds), సముద్రపు అలల ఉధృతికి (High Tidal Waves) రహదారులు (Roads) ధ్వంసమై, తీరం భారీగా కోతకు గురైంది. తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులతో తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. మరోవైపు, కోనసీమ జిల్లాలోనూ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపించింది. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు (Transformers) నేలకూలగా, భారీ వృక్షాలు వేళ్లతో సహా కూలిపోయాయి. అమలాపురం, ముమ్మిడివరం ప్రాంతాల్లో కొబ్బరి చెట్లు, అరటి తోటలు నేలకొరిగాయి. తుపాను ధాటికి పంటలు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలైన విజయనగరం, పార్వతీపురం మన్యంలోనూ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాత్రంతా కురిసిన వర్షాలతో పలు రహదారులు జలమయమయ్యాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో రెండంతస్తుల పాత భవనం కూలిపోగా, భోగాపురం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో వరదనీరు కాలనీల్లోకి చేరడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.









