సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత.. పాక్ కుట్రను భగ్నం చేసిన భారత్

Summarize with AI

జమ్మూ కాశ్మీర్‌లోని స‌రిహ‌ద్దు నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వద్ద పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. బుధవారం సాయంత్రం పూంచ్ జిల్లాలోని బాలాకోట్ సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం భారీగా కాల్పులకు తెగబడింది. అయితే భారత సైన్యం అప్రమత్తమై తగిన బదులిచ్చింది. భారత బలగాల ప్రతిఘటనకు శత్రుసైన్యం వెనక‌డుగు వేసింది.

భద్రత కఠినతరం.. పాక్‌కు గట్టి గుణపాఠం
2021 ఫిబ్రవరి 25న భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పునరుద్ధరించబడినప్పటి నుంచి ఇలాంటి ఘటనలు తగ్గాయి. ఈసారి పాక్ వైపు నుండి ఉల్లంఘన జరుగడం ఆందోళన కలిగిస్తోంది. భారత సైన్యం వెంటనే చర్యలు తీసుకుని పాక్ కుట్రను భగ్నం చేసింది. భార‌త సైన్యం రంగంలోకి దిగ‌డంతో దాయాది సేనకు గట్టి నష్టం వాటిల్లిందని సమాచారం.

అప్రమత్తమైన భారత్
గత వారం రోజులుగా పాకిస్తాన్ నుంచి వరుసగా కాల్పుల ఉల్లంఘనలు, ఉగ్రదాడులు జరుగుతుండటంతో భారత సైన్యం అప్రమత్తమైంది. పూంచ్ సెక్టార్‌లో ల్యాండ్‌మైన్ పేలుడు, రాజౌరిలో ఉగ్రవాదుల కాల్పులు, అఖ్నూర్ వద్ద ఐఈడీ పేలుడు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో భారత సైన్యం నిఘాను మరింత కఠినతరం చేసి, పాక్ కుట్రలను అణచివేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. భవిష్యత్తులో ఇంకా కఠినమైన చర్యలు ఉంటాయని భారత సైన్యం త‌న చ‌ర్య‌ల ద్వారా స్పష్టం చేస్తోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment