ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

ఏపీ కొత్త మ్యాప్‌ నిజం కాదు.. APSDMA క్లారిటీ..

Summarize with AI

28 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్ర కొత్త మ్యాప్‌ను (State New Map) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) విడుదల చేసిందని.. ఇందులో అమరావతిని (Amaravati) ఏపీ క్యాపిటల్‌గా (AP Capital) పేర్కొంది అంటూ సోషల్‌ మీడియాలో ఓ మ్యాప్‌ వైరల్‌గా మారింది.. అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాలతో కూడిన కొత్త మ్యాప్ విడుదలైనట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) స్పష్టత ఇచ్చింది. ఈ మేరకు 06-04-2026న విడుదల చేసిన ప్రెస్ నోట్‌లో సోషల్ మీడియా మరియు కొన్ని మీడియా వేదికల్లో ప్రచారంలో ఉన్న సమాచారం అసత్యమని పేర్కొంది.

APSDMA ప్రకారం, తమ సంస్థ తరఫున ఎటువంటి కొత్త మ్యాప్‌ను విడుదల చేయలేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న 28 జిల్లాల మ్యాప్ పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదారి పట్టించేలా ఉందని తెలిపింది. APSDMA పేరు, లోగోను ఉపయోగించి షేర్ చేస్తున్న ఆ మ్యాప్‌కు ఎలాంటి ప్రామాణికత లేదని పేర్కొంది. ఇలాంటి ధృవీకరించని సమాచారాన్ని ప్రజలు, మీడియా సంస్థలు నమ్మకూడదని, దానిని షేర్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని APSDMA సూచించింది. అధికారికంగా సంస్థ విడుదల చేసే సమాచారం మరియు ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అధికారులు హెచ్చరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment