ఏపీలో 70.72 శాతం పరిషత్ పోలింగ్.. విశాఖ టాప్‌!

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ 70.72 శాతం.. విశాఖ టాప్‌!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా జరిగినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్‌ శాతాన్ని ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు తెలిపింది.

జిల్లాల వారీగా చూస్తే విశాఖపట్నం జిల్లా 82.51 శాతం పోలింగ్‌తో మొదటి స్థానంలో నిలవగా, అల్లూరి సీతారామరాజు జిల్లా 62.01 శాతంతో చివరి స్థానంలో నిలిచింది. విజయనగరంలో 76.21 శాతం, చిత్తూరులో 76.30 శాతం, అనకాపల్లిలో 75.58 శాతం, ఏలూరులో 75.52 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 75.53 శాతం పోలింగ్‌ నమోదైంది.

ఇక మిగిలిన జిల్లాల విషయానికొస్తే.. శ్రీకాకుళంలో 65.51 శాతం, పార్వతీపురం మన్యంలో 67.13 శాతం, పోలవరంలో 65.48 శాతం, కాకినాడలో 68.94 శాతం, కోనసీమలో 66.33 శాతం, తూర్పుగోదావరిలో 71.56 శాతం, పశ్చిమగోదావరిలో 69.73 శాతం, కృష్ణాలో 73.21 శాతం, గుంటూరులో 73.12 శాతం, పల్నాడులో 70.93 శాతం, బాపట్లలో 67.47 శాతం, ప్రకాశంలో 68.53 శాతం, మార్కాపురంలో 67.69 శాతం, నెల్లూరులో 70.62 శాతం, తిరుపతిలో 68.67 శాతం, అన్నమయ్యలో 69.19 శాతం, వైఎస్సార్ కడపలో 71.78 శాతం పోలింగ్ నమోదైంది. అలాగే అనంతపురంలో 64.38 శాతం, శ్రీ సత్యసాయిలో 73.71 శాతం, కర్నూలులో 68.29 శాతం, నంద్యాలలో 74.27 శాతం ఓటింగ్ నమోదైంది.

మొత్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోగా, రాష్ట్ర సగటు పోలింగ్‌ 70.72 శాతంగా నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment