ఏపీలో(Andhra Pradesh) విజయ డెయిరీ (Vijaya Dairy) బోర్డు వ్యవహారం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశమైంది. విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధనరావుతో(Dasari Balavardhan Rao) పాటు మరో నలుగురు బోర్డు డైరెక్టర్ల ఎన్నికలు చెల్లవని ఏపీ హైకోర్టు (AP High Court) తీర్పు ఇవ్వడం సంచలనంగా మారింది. బోర్డు ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థులను డిఫాల్టర్లుగా(Defaulters) ప్రకటించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
విజయ డెయిరీ చైర్మన్ దాసరి బాలవర్ధనరావుతో పాటు బోర్డు డైరెక్టర్లు సాయి, పాలడుగు నాని(Sai), నాగేశ్వరరావు(Nageswara Rao), శైలజ (Shailaja) ఎన్నికలను హైకోర్టు (High Court)చెల్లనివిగా కోర్టు ప్రకటించింది. ఈ ఐదుగురిపై పోటీ చేసి నెగ్గిన అభ్యర్థులను డిఫాల్టర్లుగా ప్రకటించడంతో వివాదం న్యాయస్థానానికి చేరింది. ఈ వ్యవహారంపై విచారణ అనంతరం ఎన్నికల చెల్లుబాటుకు సంబంధించి కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
విజయ డెయిరీ (Vijaya Dairy) చైర్మన్గా ఉన్న చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu) రాజీనామా వ్యవహారం గతంలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఆయనను పదవి నుంచి తప్పించేందుకు టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారని, ఈ వ్యవహారంలో మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి కీలకంగా వ్యవహరించారని విమర్శలు వచ్చాయి. ఒత్తిడి కారణంగా చలసాని ఆసుపత్రి పాలయ్యారని, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆయనతో బలవంతంగా రాజీనామా (Resignation) చేయించిన విషయం తెలిసిందే.
చలసాని రాజీనామా అనంతరం విజయ డెయిరీ కొత్త చైర్మన్గా దాసరి బాలవర్ధనరావు (Dasari Balavardhan Rao) ఎన్నికయ్యారు. తాజాగా ఆయనతో పాటు నలుగురు డైరెక్టర్ల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువడినట్లు వచ్చిన వివరాలతో విజయ డెయిరీ బోర్డు వ్యవహారం మరోసారి రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది.








