ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమి ప్రభుత్వం (Coalition Government) ప్రజా సమస్యలు(Public Issues), అభివృద్ధి(Development), సంక్షేమంపై (Welfare) దృష్టి పెట్టడం కంటే.. వైసీపీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Y.S. Jagan Mohan Reddy) ప్రతిష్టను దిగజార్చడమే లక్ష్యంగా పెట్టుకుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రుషికొండ కట్టడాలు (Rushikonda Buildings), తిరుమల లడ్డూ (Tirumala Laddu), లిక్కర్ స్కామ్ (Liquor Scam) అంటూ గతంలో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా, హడావిడి చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు తాజాగా వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల (Government Schools) విద్యార్థులకు Students) ఉచితంగా పంపిణీ చేసిన బైజూస్ (Byju’s) కంటెంట్, ట్యాబ్‌లపై పడింది.
గతంలో తెరపైకి తెచ్చిన ఏ ఒక్క ఆరోపణలోనూ ఇంతవరకు నిరూపించదగ్గ ఆధారాలు చూపించలేకపోయిన ప్రభుత్వం, ఇప్పుడు బైజూస్ ఒప్పందంలో అవకతవకలు జరిగాయంటూ మరో కొత్త అంశాన్ని రాజకీయం చేయడానికి సిద్ధమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డీఎస్సీలో(DSC) అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ పోరాటం చేస్తున్న సమయంలో, బైజూస్‌ను తెరపైకి తేవడం చర్చనీయాంశంగా మారింది.

ముందు ఊదరగొట్టడం.. తర్వాత సైలెంట్
కూటమి ప్రభుత్వం గతంలో సృష్టించిన హడావిడి, వాటి ప్రస్తుత పరిస్థితిపై రాజకీయ విశ్లేషకులు కొన్ని ఉదాహరణలను ప్రస్తావిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.250 కోట్ల పైచిలుకు ఖర్చుతో విశాఖపట్నంలో (Visakhapatnam) ప్రభుత్వ ఆస్తిగా రుషికొండ భవనాలను నిర్మిస్తే.. వాటిని జగన్ సొంత ప్యాలెస్‌లు అంటూ టీడీపీ(TDP), దానికి అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ, కేవలం యోగా డే కోసమే రూ.330 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు.. రూ.250 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ భవనాలను నిరుపయోగంగా ఉంచి రాజకీయం చేయడంపై ప్రజల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

తిరుమల లడ్డూ వివాదం
కలియుగ దైవం శ్రీవెంకటేశ్వరస్వామి (Lord Venkateswara) లడ్డూలో (Laddu) జంతుకొవ్వు(Animal Fat), చేపనూనె (Fish Oil) కలిశాయంటూ కూటమి ప్రభుత్వం నానా యాగీ చేసింది. అనుకూల మీడియా, సోషల్ మీడియా యాక్టివిస్టుల ద్వారా వైసీపీపై(YSRCP) విపరీతమైన ప్రచారం చేయించింది. కానీ, చివరకు ఆ ఆరోపణలపై ఎలాంటి గట్టి ఆధారాలు తేల్చలేకపోయారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం నియమించిన ‘సిట్'(SIT) ఎలాంటి జంతుకొవ్వు ఆనవాళ్లు నెయ్యిలో లేవని తేల్చడంతో కూటమిది అబద్ధపు ప్రచారం అని తేలిపోయింది. చివరకు అది అటు తిరిగి, ఇటు తిరిగి చంద్రబాబు సొంత వ్యాపార సంస్థ హెరిటేజ్‌కు (Heritage Foods) చుట్టుకోవడంతో ఆ అంశాన్ని కమిషన్ పేరుతో వదిలేశారు.

లిక్కర్ స్కామ్ ఆరోపణలు
మొదట్లో ఈ కేసులో ఏకంగా లక్ష కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ప్రచారం చేశారు. ఆ తర్వాత దాన్ని రూ.3,000 కోట్లకు తగ్గించారు. రెండేళ్లుగా సాగుతున్న ఈ కేసులో ఇప్పటివరకు ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు కూడా ప్రజల ముందు ఆధారాలు ఉంచలేకపోయారు. పైగా, ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరికీ కోర్టుల ద్వారా బెయిల్స్ మంజూరు కావడం గమనార్హం. మూడు ప్రధాన ఆరోపణలు చేసి ఒక్క ఆధారం కూడా చంద్రబాబు చూపించలేకపోగా, వాటిని రాజకీయాల కోసం విపరీతంగా ఉపయోగించుకున్నారనే విమర్శలున్నాయి.
పేద విద్యార్థులను గేలిచేసిందెవరూ..?
పేద విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి డిజిటల్ విద్యను అందించాలనే సంకల్పంతో వైఎస్ జగన్ ప్రభుత్వం నాణ్యమైన శాంసంగ్ ట్యాబ్‌లను బైజూస్ కంటెంట్‌తో ఉచితంగా పంపిణీ చేసింది. ఆ రోజుల్లోనే “పిల్లలు ట్యాబ్‌లు వాడుతూ చెడిపోతున్నారు” అంటూ అనుకూల మీడియాలో టీడీపీ తప్పుడు రాతలు రాయించిందని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

నిజానికి, వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐక్యరాజ్యసమితి (UN) వరకు వెళ్లి ఏపీ ప్రతినిధులుగా తమ గొంతును వినిపించి రికార్డు సృష్టించారు. బెండపూడి లాంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంటే.. అప్పట్లో టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వారిపై అసభ్యకరంగా ట్రోలింగ్ చేసిన ఉదంతాన్ని లోకమంతా చూసింది. మళ్లీ, ఇప్పుడు పేద విద్యార్థులకు అందించిన ట్యాబ్‌లు, బైజూస్ వంటి ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ఎడ్యుకేషన్ సంస్థను రాజకీయాల్లోకి లాగడం మంచిది కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఏదైనా ఒక అంశంలో స్కామ్ జరిగితే పక్కా ఆధారాలు ఉండాలి, చట్టపరమైన విచారణ జరగాలి. కానీ, కేవలం వైరి పక్షాల ప్రతిష్టను దిగజార్చడం కోసం అనుకూల మీడియాతో నిరాధార ప్రచారాలు చేయడం, తీరా విచారణలో ఏమీ తేలకపోతే ఆ కేసులను పక్కన పెట్టేయడం కూటమి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని వదిలేసి, ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటూ విషప్రచారాలకే పరిమితమైతే.. అది భవిష్యత్తులో ప్రభుత్వానికే ‘బూమరాంగ్’ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.








రాజధాని కట్టుకునే చేతకాదు, తెలంగాణలో విస్తరిస్తారా?.. – కవిత (Video)