ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

ఏపీకి కొత్త సీఎస్, డీజీపీలు.. కీలక నిర్ణయాల దశలో ప్రభుత్వం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కొత్త సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (C.S.), డీజీపీ (Director General of Police) నియామకానికి రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుండటంతో సీఎం చంద్రబాబు నాయుడు కొత్తవారిని ఎంపిక చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.

సీఎస్ రేసులో ఎవరు ముందున్నారు?
నూతన సీఎస్ ఎంపిక కోసం ముగ్గురు సీనియర్ అధికారులు పోటీపడుతున్నారు. వీరిలో విజయానంద్, సాయి ప్రసాద్, ఆర్పీ సిసోడియా పేర్లు చర్చలో ఉన్నాయి. విజయానంద్ ఏపీ అందులోనూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సీఎంకు తెలిసిన అధికారి కావ‌డం ఆయ‌న‌కు క‌లిసొచ్చే అంశం. సాయిప్రసాద్, సిసోడియా 1991 బ్యాచ్‌కు చెందిన అధికారులు కాగా, విజయానంద్ 1992 బ్యాచ్ అధికారి.

డీజీపీగా ఎవరు?
డీజీపీ పదవికి సంబంధించి కూడా ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు పదవీకాలం ఈనెలాఖ‌రుతో ముగుస్తుంది. ఆయన స్థానంలో 1992 బ్యాచ్‌కు చెందిన హరీష్‌ కుమార్‌ గుప్తాను నియమించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కసరత్తు ముగింపు దశలో
విజయానంద్‌ విద్యుత్ శాఖ సెక్రటరీగా పనిచేస్తున్నారు. మరోవైపు హరీష్‌ కుమార్‌ గుప్తా గతంలో డీజీపీగా కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉంది. ఏపీ ప్రభుత్వం చేపట్టబోయే కొత్త లక్ష్యాలను సాకారం చేయడంలో వీరిద్దరు కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment