అమరావతిలో మరో భూ కుంభకోణం? కాలేజీకి రూ.70 కోట్ల విలువైన ల్యాండ్ – రైతుల ఆగ్రహం!

అమరావతిలో మరో భూ కుంభకోణం? కాలేజీకి రూ.70 కోట్ల విలువైన ల్యాండ్ - రైతుల ఆగ్రహం!

రాజధాని ప్రాంతం అమరావతిలో (Amaravati) మరో భూ వివాదం (Land Dispute) తెరపైకి వచ్చింది. తుళ్లూరు (Thulluru) పరిధిలోని ఓ ప్రైవేట్ కాలేజీ (Private College) భూ కేటాయింపుల (Land Allocations) వ్యవహారం ఇప్పుడు రాజధాని గ్రామాల్లో సంచలనంగా మారింది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా, చెరువు పోరంబోకు స్థలంలో ఉన్న కాలేజీకి దాదాపు రూ.70 కోట్ల విలువైన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

వివాదం నేపథ్యం ఏంటి?
రాజధాని మాస్టర్ ప్లాన్(Capital Master Plan), రోడ్ల నిర్మాణంలో (Road Construction) భాగంగా ఈ వివాదం మొదలైంది. తుళ్లూరు పరిధిలోని సర్వే నెంబర్ 78లో 23.80 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న చెరువు పోరంబోకు స్థలంలో ‘ఎస్ఆర్విఎస్ అండ్ ఎన్ఎస్ఆర్’ (SRVS & NSR) జూనియర్ కాలేజీని నిర్మించారు. అమరావతి కనెక్టివిటీలో భాగంగా ఈ ప్రైవేట్ జూనియర్ కాలేజీ స్థలం గుండా N-14 రోడ్డును ప్రతిపాదించారు. రోడ్డు నిర్మాణంలో కాలేజీ భవనాలు దెబ్బతినడంతో, గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే సదరు యాజమాన్యానికి దాదాపు రూ. 2 కోట్లు నష్టపరిహారంగా చెల్లించినట్టు సమాచారం.

తాజా కేటాయింపులపైనే అసలు వివాదం!
మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం (Chandrababu Government) అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కాలేజీ వ్యవహారంలో తీసుకున్న ఓ తాజా నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. చెరువు పోరంబోకు స్థలంలో రోడ్డు పోగా మిగిలిన కాలేజీకి ప్రత్యామ్నాయంగా.. రాయపూడిలోని శాశ్వత సచివాలయం సమీపంలో అత్యంత విలువైన 3 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించిన‌ట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ స్థలం విలువ సుమారు రూ.70 కోట్లు ఉంటుందని అంచనా. “అసలు చెరువు పోరంబోకు అనేది ప్రభుత్వ స్థలం. అలాంటి ఆక్రమిత స్థలంలోంచి రోడ్డు వెళ్తే, ప్రైవేట్ కాలేజీకి కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ఎలా కట్టబెడతారు?” అని ప్ర‌శ్నిస్తున్నారు స్థానిక రైతులు.

రైతుల ఆగ్రహం.. ముడుపుల ప్రచారం!
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అడ్డగోలుగా ధారాదత్తం చేస్తున్నారంటూ అమరావతి రైతులు (Amaravati Farmers) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్ (Land Pooling) కింద తాము రాజధాని కోసం భూములిస్తే, ప్రభుత్వం మాత్రం నిబంధనలను తుంగలో తొక్కి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేస్తోందని మండిపడుతున్నారు. ఈ భూ కేటాయింపుల వెనుక భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయనే ప్రచారం రాజధాని అంతటా పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కుతుండటంతో, ఈ సంచలన ఆరోపణలపై చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, ఎలాంటి వివరణ ఇస్తుందో వేచి చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment