ప‌ల్టీలు కొట్టిన అజిత్‌ రేసింగ్ కార్‌.. త‌ప్పిన ప్ర‌మాదం (వీడియో)

ప‌ల్టీలు కొట్టిన అజిత్‌ రేసింగ్ కార్‌.. త‌ప్పిన ప్ర‌మాదం (వీడియో)

Summarize with AI

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్‌(Ajith Kumar)కు స్పెయిన్‌(Spain)లో జరుగుతున్న రేసింగ్‌ (Racing Accident)లో పెను ప్రమాదం తప్పింది. రేసింగ్ సమయంలో మరో కారును తప్పించే ప్రయత్నంలో అజిత్ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. రేసింగ్ ట్రాక్‌పై జరిగిన ఈ ఘటన అజిత్ అభిమానులను ఒక్కసారిగా ఉత్కంఠకు గురిచేసింది. అయితే, అజిత్ రేసింగ్ టీమ్ ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పటికే వైరల్ అవుతోంది.

ట్రాక్‌పై ప‌ల్టీలు కారులోంచి అజిత్ కుమార్ సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రావ‌డంతో ఆయ‌న అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాదం త‌ర్వాత కూడా ఆయ‌న రేసింగ్ కొన‌సాగించిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌తంలో దుబాయ్‌లో జ‌రిగిన గ్రాండ్ ప్రీ రేస్ ప్రాక్టీస్ స‌మ‌యంలోనూ అజిత్ కారు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే.

Join WhatsApp

Join Now

Leave a Comment