మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ.. (Video)

మాసబ్‌ట్యాంక్‌లో న్యాయవాది హత్య.. కారుతో ఢీకొట్టి మ‌రీ..

Summarize with AI

హైద‌రాబాద్ (Hyderabad) నగరంలోని మాసబ్ ట్యాంక్ (Masab Tank) పరిధిలో తీవ్ర కలకలం రేపిన కారు దాడి (Car Attack) ఘటన విషాదాంతమైంది. గుర్తుతెలియని దుండగుల చేతిలో హత్యాయత్నానికి గురైన ప్రముఖ న్యాయవాది (Advocate) ఖాజా మొయినుద్దీన్ (Khaja Moinuddin) కన్నుమూశారు. స్థానిక ఆసుపత్రిలో అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ ఆయన శ్వాస విడిచారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. మాసబ్‌ట్యాంక్ ప‌రిధిలోని ప్ర‌ముఖ అడ్వొకేట్‌ ఖాజా మొయినుద్దీన్ తన నివాసం నుండి బయటకు రాగానే, అక్కడ అప్పటికే మాటు వేసి ఉన్న కొందరు దుండగులు వేగంగా కారుతో ఆయనను బలంగా ఢీకొట్టారు. ఆయన కింద పడిపోయిన తర్వాత కూడా కారుతో తొక్కించి, అక్కడి నుంచి అత్యంత వేగంగా పరారయ్యారు.

తీవ్ర రక్తస్రావంతో, స్పృహలేని స్థితిలో పడి ఉన్న న్యాయవాదిని స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన శనివారం తుదిశ్వాస విడిచారు.

‘హిట్ అండ్ రన్’ నుంచి ‘హత్య’ కేసుగా మార్పు
మొదట ఈ ఘటనను రోడ్డు ప్రమాదంగా లేదా హిట్ అండ్ రన్ కేసుగా (Hit and Run Case) భావించినప్పటికీ, విచారణలో కీలక ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. న్యాయవాది మరణించడంతో, స్థానిక పోలీసులు ఈ కేసును ‘హిట్ అండ్ రన్’ సెక్షన్ల నుండి హత్య కేసు (Murder Case) గా మార్చారు. “బాధితుడిని టార్గెట్ చేస్తూనే ఈ దాడి జరిగినట్లు అనుమానిస్తున్నాం. పాత కక్షలు లేదా వృత్తిపరమైన వివాదాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం” అని తెలిపారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా వేట
ఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీమ్, ఉన్నతాధికారులు ఆధారాలు సేకరించారు. నిందితులు పారిపోయిన మార్గాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ మృతి పట్ల స్థానిక న్యాయవాద సంఘాలు తీవ్ర దిగ్భ్రాంతిని, నిరసనను వ్యక్తం చేశాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment