నటుడు విజయ్‌పై కేసు నమోదు

నటుడు విజయ్‌పై కేసు నమోదు

Summarize with AI

కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌ప‌తి, టీవీకే(TVK) (తమిళాగ వెట్టి కజగం) పార్టీ అధ్య‌క్షుడు విజ‌య్‌(Vijay)పై కేసు(Case) న‌మోదైంది. టీవీకే పార్టీ రెండవ మానాడు సభ మ‌దురై (Madurai)లో జ‌రిగింది. ఈ స‌భ‌లో విజయ్ ర్యాంప్‌ (Ramp)పై నడిచి వెళ్తున్న సమయంలో అతన్ని కలవాలని ప్రయత్నించిన అభిమాని(Fan) శరత్ కుమార్‌ (Sharath Kumar)ను బౌన్సర్లు (Bouncers) అడ్డుకున్నారు. అయితే ఈ ఘటనలో గాయాలు అయ్యిన శరత్ కుమార్ పెరంబలూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, విజయ్, బౌన్సర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు.

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విజయ్, అతని బౌన్సర్లపై కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై ఆరా తీయడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. విజయ్ ఇటీవల తన రాజకీయ ప్రయాణాన్ని ముమ్మరం చేస్తున్న సమయంలో ఈ ఘటన ఆయనపై విమర్శలు కురిపించే అవకాశం ఉంది. టీవీకే పార్టీ నాయకత్వం ఈ విషయంపై ఇంకా ఎలాంటి స్పందన ఇవ్వలేదు.

Join WhatsApp

Join Now

Leave a Comment